Trinidad
-
టీమిండియాకు భారీ నష్టం! అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు: మాజీ క్రికెటర్
West Indies vs India, 2nd Test: ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో పటిష్ట జట్లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందులో కొన్ని విదేశాల్లో ఆడాలి. కాబట్టి ప్రస్తుతం ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం టీమిండియాకు తీరని నష్టంగానే భావించాలి’’ అని భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో టీమిండియా తమ తొలి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడింది. 2-0తో క్లీన్‌స్వీప్ చేద్దామనుకుంటే.. కరేబియన్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భావించింది. అయితే, వర్షం కారణంగా విండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయింది. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు విండీస్ బ్యాటర్ల పనిపట్టేవారే. ఎనిమిది వికెట్లను పడగొట్టడం అంత కష్టమయ్యేది కాదు. అయితే, అనూహ్యంగా వరణుడి కారణంగా ఆట వీలుకాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. టీమిండియాకు భారీ నష్టం ఈ నేపథ్యంలో 12 పాయింట్లు రావాల్సిన చోట టీమిండియాకు 4 పాయింట్లే వచ్చాయి. ఆతిథ్య విండీస్ ఖాతాలో సైతం 4 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో దీప్‌దాస్ గుప్తా మాట్లాడుతూ.. ట్రినిడాడ్ మ్యాచ్ డ్రా అయిన కారణంగా భారత జట్టు భారీగా నష్టపోయిందని పేర్కొన్నాడు. ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో ఆరంభంలోనే ఇలా జరిగింది. వెస్టిండీస్ సిరీస్ అనగానే రెండు మ్యాచ్‌లు గెలిచి టీమిండియా 2-0తో ముగిస్తుందని అనుకున్నారంతా! కానీ అలా జరుగలేదు. మున్ముందు పటిష్ట జట్లతో ఆడాల్సి ఉంది. అలాంటపుడు 8 పాయింట్ల మేర నష్టపోవడం అంటే మామూలు విషయం కాదు’’ అని దీప్‌దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు. అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు ఇక వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదన్న ఈ మాజీ బ్యాటర్.. నిలకడలేమి ఆట వల్లే అభాసుపాలవుతున్నారని అభిప్రాయపడ్డాడు. కాగా డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం కోల్పోగా.. పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్‌కప్‌నకు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం -
ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!
న్యూఢిల్లీ: దొంగ పాస్పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్పోర్ట్కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద..దొంగ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ మూడో బంతికే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (2) పెవిలియన్ చేరాడు. ‘సెల్యూట్’ బౌలర్ కాట్రెల్ వేసిన అద్భుత బంతికి ధావన్‌ను ఎల్బీగా వెనుదిరిగాడు. 28 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 127 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి 66 (83 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 34 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి రోస్తోన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన యువ ఆటగాడు రిషభ్ పంత్ 20 (35 బంతుల్లో 2 పోర్లు) 23వ ఓవర్లో బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్‌గా శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులతో కోహ్లితో పాటు క్రీజులో ఉన్నాడు. ఇక తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. -
సీపీఎల్ చాంప్ ట్రినిడాడ్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టైటిల్‌ను ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టు గెలుచుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో ట్రినిడాడ్ జట్టు 20 పరుగుల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రినిడాడ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 178 పరుగులు చేసింది. డెల్పోర్ట్ (50), కమ్రాన్ అక్మల్ (60) అర్ధసెంచరీలు చేశారు. కెప్టెన్ డ్వేన్ బ్రేవో (29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్, ఎమ్రిట్ రెండేసి వికెట్లు తీశారు. బార్బడోస్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓడింది. డ్వేన్ స్మిత్ (49) టాప్‌స్కోరర్. కెప్టెన్ పొలార్డ్ (20 నాటౌట్) చివర్లో పోరాడినా ఫలితం లేకపోయింది. బెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ట్రినిడాడ్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్... సీపీఎల్‌లో ఈ ఏడాది ట్రినిడాడ్ జట్టులో వాటా కొనుక్కుంది. టైటిల్ గెలిచే క్రమంలో ఈ డ్వేన్ బ్రేవో సేన వరుసగా మూడు నాకౌట్ మ్యాచ్‌లలో విజయం సాధించడం విశేషం. -
చెన్నైకి ట్రినిడాడ్ షాక్
న్యూఢిల్లీ: సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు మెరుపులు మెరిపించింది. ఒక్క విజయంతో అటు సెమీస్ బెర్త సాధించడంతో పాటు... ఇటు పటిష్టమైన చెన్నై సూపర్కింగ్సను వెనక్కినెట్టి గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచింది. దీంతో నాకౌట్ పోరులో ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ట్రినిడాడ్ బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్సకు షాకిచ్చింది.ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్కింగ్స 19.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. రైనా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. విజయ్ (24 బంతుల్లో 27; 4 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రెండో ఓవర్లోనే హస్సీ (1) అవుటైనా.... రైనా, విజయ్‌లు రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆరంభంలో వేగంగా ఆడిన చెనై్న బ్యాట్సమెన్ని కరీబియన్ బౌలర్లు మధ్యలో పూర్తిగా కట్టడి చేశారు. ఈ జోడి అవుటైన తర్వాత ధోని నిలకడను కనబర్చినా... రెండో ఎండ్‌లో సహకారం కరువైంది.ఫీల్డింగ్‌లోనూ చెలరేగిన విండీస్ ఆటగాళ్లు ముగ్గురు కీలక బ్యాట్సమెన్ను రనౌట్ చేసి చెన్నైని ఘోరంగా దెబ్బతీశారు. మొత్తానికి ఏడుగురు బ్యాట్సమెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడంతో ధోనిసేన ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఎమ్రిట్ 3, రాంపాల్, సిమ్మన్‌స చెరో రెండు వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. 17.4 ఓవర్లలో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా నిలిచే ట్రినిడాడ్... మరింత ముందుగానే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ సిమ్మన్‌స (41 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్సర్లు) చెలరేగగా... లూయిస్ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), చివర్లో బ్రేవో (14 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్) రాణించారు. అశ్విన్, రైనా చెరో వికెట్ తీశారు. సిమ్మన్సకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: చెనై్న సూపర్కింగ్స ఇన్నింగ్స: హస్సీ (బి) రాంపాల్ 1; విజయ్ (బి) సిమ్మన్‌స 27; రైనా (సి) రాంపాల్ (బి) సిమ్మన్‌స 38; ధోని (సి) సిమ్మన్‌స (బి) ఎమ్రిట్ 25; డ్వేన్ బ్రేవో (సి) రామ్‌దిన్ (బి) ఎమ్రిట్ 2; జడేజా రనౌట్ 3; ఆల్బీ మోర్కెల్ (బి) రాంపాల్ 4; బద్రీనాథ్ రనౌట్ 3; అశ్విన్ రనౌట్ 9; హోల్డర్ (సి) సిమ్మన్‌స (బి) ఎమ్రిట్ 0; మోహిత్ శర్మ నాటౌట్ 0; ఎక్సట్రాలు: (లెగ్‌బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్లపతనం: 1-7; 2-62; 3-78; 4-84; 5-88; 6-102; 7-106; 8-116; 9-117; 10-118 బౌలింగ్: బద్రీ 4-0-24-0; రాంపాల్ 4-0-31-2; యాన్నిక్ ఓట్లే 2-0-17-0; ఎమ్రిట్ 3.4-0-21-3; సిమ్మన్‌స 2-0-10-2; నరైన్ 4-0-12-0 ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స: సిమ్మన్‌స (సి) మోహిత్ శర్మ (బి) అశ్విన్ 63; లూయిస్ ఎల్బీడబ్ల్యూ (బి) రైనా 38; డారెన్ బ్రేవో నాటౌట్ 11; ఓట్లీ నాటౌట్ 1; ఎక్సట్రాలు: (బైస్ 5, లెగ్‌బైస్ 1); మొత్తం: 15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 119. వికెట్లపతనం: 1-79; 2-116 బౌలింగ్: అశ్విన్ 4-0-24-1; అల్బీ మోర్కెల్ 2-0-18-0; జడేజా 2-0-30-0; రైనా 4-0-16-1; హోల్డర్ 2-0-17-0; బ్రేవో 1.1-0-8-0.