సీపీఎల్ చాంప్ ట్రినిడాడ్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టైటిల్‌ను ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టు గెలుచుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో ట్రినిడాడ్ జట్టు 20 పరుగుల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రినిడాడ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 178 పరుగులు చేసింది. డెల్‌పోర్ట్ (50), కమ్రాన్ అక్మల్ (60) అర్ధసెంచరీలు చేశారు. కెప్టెన్ డ్వేన్ బ్రేవో (29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్, ఎమ్రిట్ రెండేసి వికెట్లు తీశారు. బార్బడోస్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓడింది.
డ్వేన్ స్మిత్ (49) టాప్‌స్కోరర్. కెప్టెన్ పొలార్డ్ (20 నాటౌట్) చివర్లో పోరాడినా ఫలితం లేకపోయింది. బెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ట్రినిడాడ్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్... సీపీఎల్‌లో ఈ ఏడాది ట్రినిడాడ్ జట్టులో వాటా కొనుక్కుంది. టైటిల్ గెలిచే క్రమంలో ఈ డ్వేన్ బ్రేవో సేన వరుసగా మూడు నాకౌట్ మ్యాచ్‌లలో విజయం సాధించడం విశేషం.