
ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ మూడో బంతికే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (2) పెవిలియన్ చేరాడు. ‘సెల్యూట్’ బౌలర్ కాట్రెల్ వేసిన అద్భుత బంతికి ధావన్‌ను ఎల్బీగా వెనుదిరిగాడు. 28 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 127 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి 66 (83 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 34 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి రోస్తోన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన యువ ఆటగాడు రిషభ్ పంత్ 20 (35 బంతుల్లో 2 పోర్లు) 23వ ఓవర్లో బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్‌గా శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులతో కోహ్లితో పాటు క్రీజులో ఉన్నాడు. ఇక తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment