చెన్నైకి ట్రినిడాడ్‌ షాక్‌ | T&T beat CSK, march into CLT20 semis | Sakshi
Sakshi News home page

చెన్నైకి ట్రినిడాడ్‌ షాక్‌

Published Thu, Oct 3 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

చెన్నైకి ట్రినిడాడ్‌ షాక్‌

చెన్నైకి ట్రినిడాడ్‌ షాక్‌

న్యూఢిల్లీ: సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో జట్టు మెరుపులు మెరిపించింది. ఒక్క విజయంతో అటు సెమీస్‌ బెర్‌‌త సాధించడంతో పాటు... ఇటు పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్‌‌సను వెనక్కినెట్టి గ్రూప్‌-బిలో టాపర్‌గా నిలిచింది. దీంతో నాకౌట్‌ పోరులో ముంబై ఇండియన్స్  తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో ఆకట్టుకున్న ట్రినిడాడ్‌ బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్‌‌సకు షాకిచ్చింది.ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్‌‌స 19.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. రైనా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. విజయ్‌ (24 బంతుల్లో 27; 4 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
 
 రెండో ఓవర్‌లోనే హస్సీ (1) అవుటైనా.... రైనా, విజయ్‌లు రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆరంభంలో వేగంగా ఆడిన చెనై్న బ్యాట్‌‌సమెన్‌ని కరీబియన్‌ బౌలర్లు మధ్యలో పూర్తిగా కట్టడి చేశారు. ఈ జోడి అవుటైన తర్వాత ధోని నిలకడను కనబర్చినా... రెండో ఎండ్‌లో సహకారం కరువైంది.ఫీల్డింగ్‌లోనూ చెలరేగిన విండీస్‌ ఆటగాళ్లు ముగ్గురు కీలక బ్యాట్‌‌సమెన్‌ను రనౌట్‌ చేసి చెన్నైని ఘోరంగా దెబ్బతీశారు. మొత్తానికి ఏడుగురు బ్యాట్‌‌సమెన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే అవుట్‌ కావడంతో ధోనిసేన ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఎమ్రిట్‌ 3, రాంపాల్‌, సిమ్మన్‌‌స చెరో రెండు వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్‌ 15.1 ఓవర్లలో 2 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. 17.4 ఓవర్లలో గెలిస్తే గ్రూప్‌ టాపర్‌గా నిలిచే ట్రినిడాడ్‌... మరింత ముందుగానే మ్యాచ్‌ను ముగించింది. 
 
ఓపెనర్‌ సిమ్మన్‌‌స (41 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్సర్లు) చెలరేగగా... లూయిస్‌ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), చివర్లో బ్రేవో (14 బంతుల్లో 11 నాటౌట్‌; 1 ఫోర్‌) రాణించారు. అశ్విన్‌, రైనా చెరో వికెట్‌ తీశారు. సిమ్మన్‌‌సకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: చెనై్న సూపర్‌కింగ్‌‌స ఇన్నింగ్‌‌స: హస్సీ (బి) రాంపాల్‌ 1; విజయ్‌ (బి) సిమ్మన్‌‌స 27; రైనా (సి) రాంపాల్‌ (బి) సిమ్మన్‌‌స 38; ధోని (సి) సిమ్మన్‌‌స (బి) ఎమ్రిట్‌ 25; డ్వేన్‌ బ్రేవో (సి) రామ్‌దిన్‌ (బి) ఎమ్రిట్‌ 2; జడేజా రనౌట్‌ 3; ఆల్బీ మోర్కెల్‌ (బి) రాంపాల్‌ 4; బద్రీనాథ్‌ రనౌట్‌ 3; అశ్విన్‌ రనౌట్‌ 9; హోల్డర్‌ (సి) సిమ్మన్‌‌స (బి) ఎమ్రిట్‌ 0; మోహిత్‌ శర్మ నాటౌట్‌ 0; ఎక్‌‌సట్రాలు: (లెగ్‌బైస్‌ 3, వైడ్లు 3) 6; మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 118.
 
వికెట్లపతనం: 1-7; 2-62; 3-78; 4-84; 5-88; 6-102; 7-106; 8-116; 9-117; 10-118
బౌలింగ్‌: బద్రీ 4-0-24-0; రాంపాల్‌ 4-0-31-2; యాన్నిక్‌ ఓట్లే 2-0-17-0; ఎమ్రిట్‌ 3.4-0-21-3; సిమ్మన్‌‌స 2-0-10-2; నరైన్‌ 4-0-12-0
ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఇన్నింగ్‌‌స: సిమ్మన్‌‌స (సి) మోహిత్‌ శర్మ (బి) అశ్విన్‌ 63; లూయిస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రైనా 38; డారెన్‌ బ్రేవో నాటౌట్‌ 11; ఓట్లీ నాటౌట్‌ 1; ఎక్‌‌సట్రాలు: (బైస్‌ 5, లెగ్‌బైస్‌ 1); మొత్తం: 15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 119.
 
వికెట్లపతనం: 1-79; 2-116
బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-24-1; అల్బీ మోర్కెల్‌ 2-0-18-0; జడేజా 2-0-30-0; రైనా 4-0-16-1; హోల్డర్‌ 2-0-17-0; బ్రేవో 1.1-0-8-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement