
అహ్మదాబాద్: భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు . తాజాగా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి నటించిన ఓ ఫన్నీ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో చాహల్ కోసం అతని భార్య ఆలు పరోటా తీసుకు వస్తుంది. అయితే అది తినడానికి ముందు ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించట్లేదేమిటని అతడు చమత్కారంగా ప్రశ్నిస్తాడు.
దానికి బదులుగా ఆమె 'కాశ్మీరీ పులావ్' లో కాశ్మీర్ ఉంటుందా, 'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై చాహల్ కింద పడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ ధావన్ వరుసగా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేశాడు. కాగా మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ కోసం చాహల్ యూఏఈ వెళ్లనున్నాడు.
చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment