
ఢిల్లీ: మెట్రోలో డ్యాన్సులు చేయకూడదని అధికారులు ఎంత చెప్పినప్పటికీ ప్రయాణికులు వినిపించుకోవడం లేదు. మెట్రోలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోల ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన యువతి నేహా బాసిన్, బిప్పి లహరి పాడిన 'అసలామ్ ఈ ఇష్క్' పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బాగా డ్సాన్స్ చేశారని కొందరు మెచ్చుకోగా.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెట్టారు.
ఇదీ చదవండి:రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
Comments
Please login to add a commentAdd a comment