Delhi Metro Corporation
-
Delhi: విద్యార్థులకు మెట్రో శుభవార్త
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్టు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో శుభవార్త తెలిపింది. ఈరోజు (ఫిబ్రవరి 15)నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో ప్రత్యేక వెసులుబాటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అడ్మిట్ కార్డులను మెట్రో స్టేషన్ సిబ్బందికి చూపించాలని తెలియజేసింది.ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు టికెట్ ఆఫీస్ మెషీన్స్ (టీఓఎం), కస్టమర్ కేర్ (సీసీ) కేంద్రాలలో టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. రద్దీ సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఢిల్లీ మెట్రో పేర్కొంది.ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలకు ఢిల్లీకి చెందిన 3.30 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఢిల్లీ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదేవిధంగా పరీక్షలు జరిగే రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు మెట్రో స్టేషన్లలో సీఐఎస్ఎఫ్ సహకారంతో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.ఇది కూడా చదవండి: Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్ -
మెట్రోలో మహిళ డ్యాన్సులు.. బాలీవుడ్ పాటకు స్టెప్పేస్తూ..వీడియో వైరల్..
ఢిల్లీ: మెట్రోలో డ్యాన్సులు చేయకూడదని అధికారులు ఎంత చెప్పినప్పటికీ ప్రయాణికులు వినిపించుకోవడం లేదు. మెట్రోలో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోల ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన యువతి నేహా బాసిన్, బిప్పి లహరి పాడిన 'అసలామ్ ఈ ఇష్క్' పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బాగా డ్సాన్స్ చేశారని కొందరు మెచ్చుకోగా.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Angel (@pari_sharma2319) ఇదీ చదవండి:రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు.. -
మెట్రోలో సరసాలు: వీడియో పోర్న్ సైట్లో
ఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తూ సరసాలకు పాల్పడ్డ ఒక జంటపై కేసు నమోదైంది. అంతేకాక, ఆ జంట చేసిన పని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవగా, వాటిని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిబ్బందిలో ఒకరు సెల్ఫోన్లో వీడియో తీసి దాన్ని పోర్న్ వెబ్సైట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈమేరకు మెట్రో అధికారుల ఫిర్యాదుతో ఆజాద్‌పూర్ పోలీసులు వారిపై కేసు ఫైల్ చేశారు. ఈ విషయంపై మెట్రో అధికారి అనూజ్ దాయల్ స్పందిస్తూ పబ్లిక్ ప్లేస్‌లో ఇలా ప్రవర్తించినందుకు ఆ జంటపై కేసు నమోదు చేశాం. మరోవైపు ఈ వీడియో అశ్లీల వెబ్సైట్లో ఎలా వెళ్లిందనే విషయంలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి అభ్యంతకరంగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు. -
మెట్రో నిబంధనలు తెలియదంటోన్న ఢిల్లీ వాసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 25 లక్షల మంది ప్రయాణిస్తారు. అయితే చాలామందికి మెట్రో ప్రయాణం సందర్భంగా పాటించాల్సిన నియమాల గురించిన అవగాహన లేదు. వారికి అవగాహన లేదనడం కన్నా తమ తీరుతెన్నులు మార్చుకోవడానికి ఢిల్లీ వాసులు ఇష్టపడడం లేదనడం సముచితంగా ఉంటుంది. మెట్రో ప్రారంభించి ఇప్పటికి 13 ఏళ్లవుతోంది. దీనిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా విృస్తతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల ఆలోచనాసరళిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ పలువురు మెట్రో రైలు ట్రాక్‌ను సాధారణ రైల్వే ట్రాక్ మాదిరిగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. మెట్రో ట్రాక్‌ను దాటి ఒక ప్లాట్‌ఫారంపై నుంచి మరో ప్లాట్ఫారానికి వెళ్లడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ ఈ పద్ధతిని చాలామంది ఉయోగిస్తుంటారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు ఈ నేరంపై 12 మందిని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ రికార్డులు ద్వారా తెలుస్తోంది. 2014లో అయితే 655 మంది పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో చాలామంది తాము మొదటిసారి మెట్రోలో ప్రయాణిస్తున్నామని, తమకు నిబంధనల గురించి తెలియదని చెబుతున్నారు. మరి కొందరు ప్లాట్ ఫారం దాటి ఎలా వెళ్లాలో తెలియక ట్రాక్ దాటామన్న సాకు చెబుతుంటారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి డీఎంఆర్సీ జరిమానా విధిస్తుంటుంది. అలాంటి ప్రయత్నం చేసేవారిని పట్టివ్వడంలో సీసీటీవీ కెమేరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 90 శాతం కేసుల్లో సీసీటీవీ సహాయంతోనే పట్టుకున్నారు. అలాగే 10 శాతం మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. సీసీటీవీ కెమేరాల సహాయంతో సీఐఎస్ఎఫ్ జవాన్లు కొన్ని దుర్ఘటనలను కూడా నివారించగలుగుతున్నారు.