
ఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తూ సరసాలకు పాల్పడ్డ ఒక జంటపై కేసు నమోదైంది. అంతేకాక, ఆ జంట చేసిన పని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవగా, వాటిని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిబ్బందిలో ఒకరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దాన్ని పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈమేరకు మెట్రో అధికారుల ఫిర్యాదుతో ఆజాద్‌పూర్ పోలీసులు వారిపై కేసు ఫైల్ చేశారు. ఈ విషయంపై మెట్రో అధికారి అనూజ్ దాయల్ స్పందిస్తూ పబ్లిక్ ప్లేస్‌లో ఇలా ప్రవర్తించినందుకు ఆ జంటపై కేసు నమోదు చేశాం. మరోవైపు ఈ వీడియో అశ్లీల వెబ్‌సైట్‌లో ఎలా వెళ్లిందనే విషయంలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి అభ్యంతకరంగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment