చాలా మంది చిన్న పిల్లలతో కలిసి కారులో ప్రయాణించే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. కారు డోర్లు లాక్ వేయకపోవడం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో... నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయతో తెలియజేసే వీడియోను ట్విట్ చేశాడు పంకజ్ నైన్ అనే ఐపీఎస్ అధికారి.
వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోర్ లాక్ చేయకపోవడంతో టర్నింగ్ పాయింట్ వద్ద డోర్ లాక్ తెరచుకొని ఓ చిన్న బాలుడు కిందపడ్డాడు. హైవే రోడ్డు.. నలుదిక్కుల వాహనాలు ప్రయాణిస్తున్నా .. అదృష్టంకొద్ది ఈ బుడ్డోడు బతికిబయటపడ్డాడు. కారులోనుంచి కిందపడే సమయానికి ఎదురుగా ఓ బస్సు, బైక్.. పక్కనుంచి ఓ ఆటో వస్తుంది. బాలుడు కిందపడగానే అందరూ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదమేమి కాలేదు. వెంటనే బాలుడి తండ్రి వచ్చి.. బుడ్డొడిని కారులో తీసుకొని వెళ్లాడు. అయితే తండ్రి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డోర్ లాక్ వేయకుండా.. ఉండడం వల్లే బాలుడు కిందపడ్డాడు
‘ పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కారు డోర్లు లాక్ చేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోండి. పిల్లలు సీటులో సరిగా కూర్చున్నారా లేదా చెక్ చేసుకొని ప్రయాణించండి. అందరూ ఈ బాలుడిలాగా అదృష్టవంతులు ఉండరు కదా’ అని పంకజ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment