Viral Video: Woman Dances With Her Brother-In-Law Jiju On Popular Bollywood Song - Sakshi
Sakshi News home page

లేటు వయసులో మరదలితో ఘాటు డ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా

Published Sat, Jul 10 2021 2:26 PM | Last Updated on Sun, Jul 11 2021 11:01 AM

Viral video Shows Jija Sali Dancing On Bollywood song - Sakshi

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి.  మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. తాజాగా బావ..మరదలి మధ్య ప్రేమ బంధాన్ని వర్ణించే ఓ వీడియో సాంగ్‌ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ కుటంబంలోనైనా సరదా కోసం బావను ఆటపట్టించడం..ఎగతాళి చేయడానికి మరదలు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఈ వీడియోలో మరదలు  తన  బావతో బాలీవుడ్ పాట కు  సరదాగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లును ఫిదా చేస్తుంది. అతను కూడా తన వంతు ప్రయత్నం పాటకు తగ్గట్లుగా హావభావాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను "బోల్డ్ మీరా స్వాగ్" అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. లేటు వయసులో మరదలితో ఘాటు డ్యాన్స్‌ అంటూ కొంతమంది నెటిజన్లు ఫన్నీ  కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement