Shubman Gill Smashes a Fluent Six Down the Ground Off Ajaz Patel - Sakshi
Sakshi News home page

India vs New Zealand: గిల్‌ కళ్లు చెదిరే సిక్స్‌.. వీడియో వైరల్‌

Published Thu, Nov 25 2021 12:38 PM | Last Updated on Thu, Nov 25 2021 2:28 PM

Shubman Gill smashes a fluent six down the ground off Ajaz PatelShubman Gill smashes a fluent six down the ground off Ajaz Patel - Sakshi

Shubman Gill smashes a fluent six down the ground off Ajaz Patel: కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ అర్ధసెంచరీతో మెరిశాడు. అయితే భారత ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. రెండో బంతికి గిల్‌ కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. దీంతో బౌలర్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతే కాకుండా అతడి సిక్స్‌ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇ​​క మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే మయాంక్‌ ఆగర్వాల్‌ వికెట్‌ కోల్పోయినప్పటకీ.. శుభమన్‌ గిల్‌, పూజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కాగా లంచ్‌ విరామం తర్వాత తొలి ఓవర్‌లోనే భారత్‌ శుభమన్‌ గిల్‌(52) వికెట్‌ కోల్పోయింది. 34 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 

చదవండి: IND Vs NZ 1st Test: నిలకడగా ఆడుతున్న భారత్‌.. 20 ఓవర్లకు 63/1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement