Watch: Pizza In A Cone Making Video Goes Viral - Sakshi
Sakshi News home page

కోన్‌ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్‌!!

Published Mon, Sep 6 2021 1:44 PM | Last Updated on Tue, Sep 7 2021 12:06 PM

Pizza In A Cone Goes Viral - Sakshi

నోరూరించే వంటకాలు ఎన్నిఉన్నా పిజ్జా రుచుల ప్రత్యేకతే వేరు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పిజ్జా దర్శనమిస్తూనే ఉంటుంది. సాధారణంగా పిజ్జా అంటే గోధుమ లేదా మైదాతో తయారుచేసిన గుండ్రటి రొట్టెపైన ట్యాంగీ మారినారా సాస్‌, ఊజింగ్‌ చీజ్‌ కాంబినేషన్‌తో, రకరకాల వెజిటబుల్స్‌ ముక్కలతో అలంకరించబడి రుచికే కాకుండా చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రకరకాల రుచుల్లో దొరికే పిజ్జాలని తినడానికి ఏ సమయంలోనైనా రెడీ అంటారు భోజన ప్రియులు. ఐతే ఈ వీడియోలో ఉ‍న్న పిజ్జా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైంది. అందుకే ఇప్పుడిది వైరల్‌ అవుతోంది. అదే పిజ్జా కోన్‌..

సాధారణ రూపానికి భిన్నంగా, కోనికల్‌ స్ట్రక్చర్‌లో, సాస్‌, చీజ్‌ కూరిన ఈ ప్రత్యేకమైన పిజ్జా వైపు మనమూ ఓ లుక్కేద్దాం! యాక్ట్‌ నార్మల్‌ ఆర్‌ ఎల్స్‌ అనే యూజర్‌ ట్వీట్‌ చేసిన ఈ వీడియోలో మొదట పిజ్జా తయారు చేసే పిండితో కోన్‌ను రూపొందించారు. తర్వాత మారినారా సాస్‌, చీజ్‌తో ఫిల్‌ చేసి పూర్తిగా ఉడికేలా బేక్‌  చేశారు. ఇదొక పిజ్జాకోన్‌ వెరైటీ. చీజ్‌ కలిపిన టోస్డ్‌ వెజిటబుల్స్‌తో ఫిల్‌ చేసిన పిజ్జాకోన్‌ మరొకటి. ఈ రెండు రకాలైన పిజ్జాలకు ట్విట్టర్‌ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దీనిని ప్రయత్నిస్తామని కోరుకుంటే, ఈ విధమైన వంటకాన్ని మొదటి స్థానంలో ఉంచవలసిన అవసరం లేదని మరికొందరు పెదవి విరిచారు. కోన్‌లోపల ఫిల్‌ చేసినవి వేడిగా ఉంటాయని, నోరు కాలుతుందేమోనని కూడా చాలామంది యూజర్లు ఆరోపించారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకి వేల వ్యూస్‌ వచ్చాయి.

చదవండి: చిల్లీ మష్రూమ్స్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement