సోషల్ మీడియాకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఒక్క వీడియా జీవితాలనే మార్చేస్తుంది. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయింది. సరిగ్గా మరోసారి అలాంటి కథే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. (‘బాబా కా దాబా’ వీడియో.. రెస్పాన్స్ సూపర్)
ముంబైలోని ఫడేకే రోడ్ డోంబివాలిలో రీసైకిల్ బ్యాగులను అమ్ముతూ కుటుంబ పోషణను నెట్టుకొస్తున్న 87 ఏళ్ల జోషి అనే వ్యక్తి కథను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'చిరిగిన సోఫా కవర్లు, కర్ట్‌న్‌లను అందమైన బ్యాగులుగా తీర్చుదిద్దుతున్నాడు. కేవలం 40-80 రూపాయలకే ఈ అందమైన బ్యాగును సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరకే చేతిసంచులను అమ్ముతున్న ఈ అంకుల్‌ను మనమూ ఫేమస్ చేద్దాం బ్యాగ్ కొనడం మాత్రం మరవద్దు' అంటూ వీడియాను పోస్ట్ చేయగానే వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం..ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతున్న అంకుల్ జోషికి మనమూ బాసటగా నిలుద్దాం అంటూ పలువురు నెటిజన్లు ముందుకొస్తున్నారు.
Uncle Joshi age 87 sells bags of Rs 40 to 80.He buys broken pieces of clothes frm sofa and curtain makers.He himself stitches these bags.He sits at Phadeke Road Dombivali,#Mumbai
— Gauri (@ardor_gauri) October 17, 2020
Let's make Joshi Uncle famous & plz don't forget to buy 1 bag from him.🙏 pic.twitter.com/fbI7ZkP2dA
Comments
Please login to add a commentAdd a comment