Couple Recreates 'Rimjhim Gire Saawan' Scene-By-Scene As It Rains In Mumbai, Anand Mahindra Reacts - Sakshi
Sakshi News home page

బీచ్‌ రోడ్‌లో 'బిగ్‌ బీ' పాటకు వృద్ధ జంట స్టెప్స్‌.. ఆనంద్ మహేంద్ర ట్వీట్.. వీడియో వైరల్‌..

Published Mon, Jul 3 2023 8:41 AM | Last Updated on Mon, Jul 3 2023 9:12 AM

Couple Recreates Rimjhim Gire Saawan Scene By Scene As It Rains In Mumbai Anand Mahindra Reacts - Sakshi

ముంబయి: 1971 నాటి మంజిల్ సినిమాలోని 'రిమ్‌జిమ్ గిరే సవాన్' పాట అందరికీ గుర్తింది కదా..! ముంబయి బీచ్‌ రోడ్‌లో తీసిన ఈ పాటలో అమితాబ్, మౌషుమి ఛటర్జీ ప్రదర్శించిన హృదయాన్ని హత్తుకునే సీన్స్‌ మరువలేనివి. అయితే.. తాజాగా అచ్చం అలానే ఓ వృద్ధ జంట అదే బీచ్‌లో ఆ పాటకు సీన్‌ టు సీన్‌ ప్రదర్శించి అందర‍్ని ఆకట్టుకున్నారు. ఈ వీడియోను మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహేంద్ర షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ వద్ధ జంట ముంబయి బీచ్‌లో చిరుజల్లులు పడుతుండగా.. రిమ్‌ జిమ్ గిరే సాంగ్‌కు తగ్గ స్టెప్పులు వేశారు. ఎంతో ప్రజాధరణ కలిగిన ఈ పాటలోని ప్రతీ సీన్‌ను  రీక్రియేట్ చేశారు. పాటలోని అమాయకత్వాన్ని ఏ మాత్రం మిస్ చేయకుండా.. చిన్నపిల్లలవలె గెంతులు వేస్తూ సీన్‌ సీన్‌ రిపీట్ చేశారు. 

ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహేంద్ర.. 'ఆనాటి బిగ్‌బీ తీసిన సినిమాలోని పాటకు అదే లొకేషన్స్‌లో వృద్ధ జంట సరైన స్టెప్పులు వేశారు. వారిని అభినందిస్తున్నా. మన కలల్ని నిజం చేసుకుంటే జీవితం ఇలానే అందంగా ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు.

వీడియోకు  15 వేల లైక్స్, 7 లక్షల వ్యూస్ వచ్చాయి. వర్షాకాల రొమాన్స్‌ను వృద్ధ జంట అందరికీ గుర్తు చేశారు.. వారు నిండు జీవితం గడపాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వయస్సు కేవలం నెంబర్ మాత్రమే.. మనలోని చిన్నపిల్లల తత్వాన్ని గుర్తు చేశారని మరొకరు కామెంట్ చేశారు. మానసికంగా వారు చాలా పరిపక‍్వత సాధించారు.. అందుకే ఈ రోజుని బాగా ఎంజాయ్ చేశారని ఇంకొకరు స్పందించారు.

ఇదీ చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! సీనియర్‌ నటి సలహాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement