పోలీసు కష్టాలంటే ఇవే మరి : వైరల్‌ | Son Stopping Police Father To Go Office Viral Video | Sakshi
Sakshi News home page

పోలీసు కష్టాలంటే ఇవే మరి : వైరల్‌

Apr 28 2019 5:07 PM | Updated on Apr 28 2019 5:14 PM

Son Stopping Police Father To Go Office Viral Video - Sakshi

పోలీసుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలవుల్లేని ఉద్యోగం.. ప్రశాంతత లేని జీవితం. అర్థరాత్రి పిలిచినా పరిగెత్తుకెళ్లాలి. చిన్న పిల్లలు ఉన్న పోలీసు తండ్రులకైతే చెప్పనక్కర్లేదు. తండ్రి తనతో ఎక్కువసేపు గడపాలనే చిన్ని మనసును కష్టపెట్టక తప్పదు వారికి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పోలీసు అధికారి ఆఫీసుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి కొడుకు పోలీసు తండ్రి కాళ్లు గట్టిగా పట్టుకుని వెళ్లవద్దంటూ ఏడుస్తుంటాడు.

ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించలేక.. ఆఫీసుకు వెళ్లకుండా ఉండలేక అతడు పడ్డ వేదన వర్ణణాతీతం. పట్టువదలని విక్రమార్కుడిలాంటి కొడుకు తన పట్టు సాధించడాని పట్టు విడవకుండా తండ్రిని పట్టిన పట్టు సామాన్య జనాన్ని కదిలిస్తుంది. ఒకటి ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన చాలా మంది హృదయం ద్రవించింది. పోలీసు కుటుంబాలకు జోహార్లు.. అందరి లాగా వారికి కూడా 8 గంటల డ్యూటీ, వారంతంలో సెలవు ఉండేలా కృషి చేయాలి.. పోలీసు దుస్తులు ధరించిన అందరికి సెల్యూట్‌!.. అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు తమ సానుభూతి ప్రకటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement