క్రికెట్ అనేది వయస్సుతో సంబంధం లేని క్రీడ. ఆడాలనే తపన ఉంటే ఏ వయస్సులోనైనా మైదానంలో అడుగుపెట్టవచ్చు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆటను ఆస్వాదించవచ్చు. తాజాగా స్కాట్‌లాండ్ మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ కూడా అదే చేసి చూపించాడు.
83 ఏళ్ల వయస్సులో కూడా క్రికెట్‌పై తన మక్కువను చాటుకున్నాడు. ఓ వైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. క్రికెట్ మైదానంలో సందడి చేశాడు. ఓ స్థానిక క్లబ్ మ్యాచ్‌లో తన వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి అతడు వికెట్ కీపింగ్ చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి ఆటపై ఉన్న అంకితభావం పట్ల సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అలెక్స్ 2020లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతడు అక్సిజన్ సపోర్ట్‌తోనే తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత 3 నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది.
ఇక స్టీల్ 1967లో స్కాట్‌లాండ్ తరపున ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో లాంక్షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీల్..621 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఐర్లాండ్‌పై సాధించనివే. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు, రెండు స్టంపౌట్‌లు ఉన్నాయి.
చదవండి: IND vs AUS: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment