Scottland
-
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్‌లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్‌కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్‌తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్‌ఫాల్స్‌కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?) కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు -
83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్
క్రికెట్ అనేది వయస్సుతో సంబంధం లేని క్రీడ. ఆడాలనే తపన ఉంటే ఏ వయస్సులోనైనా మైదానంలో అడుగుపెట్టవచ్చు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆటను ఆస్వాదించవచ్చు. తాజాగా స్కాట్లాండ్ మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ కూడా అదే చేసి చూపించాడు. 83 ఏళ్ల వయస్సులో కూడా క్రికెట్‌పై తన మక్కువను చాటుకున్నాడు. ఓ వైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. క్రికెట్ మైదానంలో సందడి చేశాడు. ఓ స్థానిక క్లబ్ మ్యాచ్‌లో తన వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి అతడు వికెట్ కీపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి ఆటపై ఉన్న అంకితభావం పట్ల సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అలెక్స్ 2020లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతడు అక్సిజన్ సపోర్ట్‌తోనే తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత 3 నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది. ఇక స్టీల్ 1967లో స్కాట్లాండ్ తరపున ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో లాంక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీల్..621 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఐర్లాండ్‌పై సాధించనివే. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు ఉన్నాయి. చదవండి: IND vs AUS: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు! View this post on Instagram A post shared by Cricketgraph (@cricketgraph) -
4597 రోజుల తర్వాత.. అదే వాంఖడేలో భారత్-శ్రీలంక మ్యాచ్!
దసన్ శనక సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన శ్రీలంక.. 9వ జట్టుగా ప్రధాన టోర్నీలో అడుగుపెట్టనుంది. ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫయర్-2 జట్టుగా శ్రీలంక అర్హత సాధించింది. వాస్తవానికి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన వాంఖడే మైదానంలో భారత్ క్వాలిఫయర్-2 జట్టుతో తలపడనుంది. ఇప్పుడు శ్రీలంక క్వాలిఫయర్-2 జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టడంతో మరోసారి ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 4597 రోజుల తర్వాత... ఇక 4597 రోజుల తర్వాత తొలిసారి ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్-శ్రీలంక మ్యాచ్‌కు వేదిక కానుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే వాఖండే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయంతో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ధోని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఏప్రిల్ 2, 2011న భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. జింబాబ్వే-స్కాట్లాండ్ ఫైట్ ఇక వన్డే ప్రపంచకప్‌లో రెండో జట్టుగా అడుగుపెట్టేందుకు జింబాబ్వే-స్కాట్లాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జింబాబ్వే 6 పాయింట్లతో ఉండగా, స్కాట్లాండ్ 4 పాయింట్లతో ఉంది. జూలై 4న హరారే వేదికగా జింబాబ్వే-స్కాట్లాండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే జింబాబ్వేతో సమంగా నిలుస్తోంది. అప్పుడు నెట్రన్ రేట్ కీలకం కానుంది. అయితే జింబాబ్వే(+0.030) కంటే స్కాట్లాండ్(+0.188) రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి స్కాటిష్ జట్టు క్వాలిఫయర్-1గా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: IND vs WI: బీచ్‌లో వాలీబాల్ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్ -
పగలు ఫిజిక్స్ టీచర్.. రాత్రికి అడల్ట్ సైట్లో ఫొటోలు షేరింగ్.. ఎందుకో తెలుసా?
Physics Teacher kirsty buchan.. పగలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే చీచర్ ఆమె.. కానీ, రాత్రి అయితే మాత్రం ఆమె తన అర్ధనగ్న ఫొటోలను తీసుకుంటూ వాటిని అడల్ట్ సైట్స్‌లో పెడుతోంది. ఈ విషయం కాస్తా విద్యార్థులకు తెలియడంతో చివరకు టీచర్ జాబ్‌కు రాజీనామా చేసింది. వివరాల ప్రకారం.. స్కాట్లాండ్లోని బానర్మన్ హైస్కూల్లో క్రిస్టీ బూచన్ ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తోంది. దీంతో, ఆమె ఉదయం పూట కొన్ని సంవర్సతరాలుగా పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తోంది. కానీ, రాత్రి అవగానే ఆమె మరో పని కూడా చేస్తూ విద్యార్థుల కంటపడకుండా జాగ్రత్తపడింది. కాగా, రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటూ ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసేది. వెబ్సైట్లో పోస్ట్ చేసేందుకు ఫొటో షూట్ నిర్వహించుకుని వాటిని సైట్లో పోస్ట్ చేసేది. ఇలా చేయడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. అయితే, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. దొరకనంత వరకూ దొర.. దొరికిన తర్వాత ఎంతటి వారినైనా దొంగే అంటారనే సమేత ఉంది కదా. ఆమెకు ఇదే సమెత వర్తించింది. ఇలా చేస్తున్న క్రమంలో సదరు ఫిజిక్స్ టీచర్ ఫొటోలు ఓ విద్యార్థి కంటపడ్డాయి. దీంతో, అతడు ఈ విషయాన్ని స్కూల్లో అందరికీ చెప్పేశాడు. దీంతో, స్కూల్ క్రమశిక్షణా కమిటీ ఆమెను విచారణకు రావాలని కోరింది. ఈ క్రమంలో వారు.. తనను తప్పుబట్టేది ఏంటని.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫొటోలు పోస్టు చేయడానికి కారణమిదే.. అయితే, ఫిజిక్స్ టీచర్ క్రిస్టీ బూచన్కు కుమారుడు(11) ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు డబ్బు సరిపోకపోవడంతో తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుమారుడికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సర్జరీలకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇలా, నగ్న చిత్రాలను పోస్ట్ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నట్టు పేర్కొంది. ఆ పని చేస్తున్నందుకు తాను నరకం అనుభవిస్తున్నానని వెల్లడించింది. ఉదయం టీచర్ పనిచేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి కోసం తాను కరెక్ట్‌గానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. A physics teacher has resigned from her job after pornographic images of her emerged online. Kirsty Buchan, 33, left her post at Bannerman High School in Baillieston, Glasgow, after explicit pictures from her Only Fans site were circulated among pupils. pic.twitter.com/tuBFfUU3qR — vijay banga (@lekh27) December 1, 2022 -
వైద్యం ముసుగులో అసభ్యకర చేష్టలు.. 48 మంది మహిళా రోగులతో..
సాక్షి, న్యూఢిల్లీ: అతనో వైద్యుడు.. రోగుల బాగోగులు చూసి ధైర్యం చెప్పాల్సిందిపోయి వారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో విచక్షణ మరచి మృగంలా వ్యవహరించాడు. వారికి ముద్దులు పెడుతూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన డాక్టర్ కృష్ణ సింగ్(72) మహిళా పేషెంట్లతో అనుచితంగా వ్యవహరించాడు. స్కాట్లాండ్లో బీపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణ సింగ్.. తన కేరీర్‌లోని 35 ఏండ్లలో సుమారు 48 మంది మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. తన వద్దకు వచ్చిన మహిళా పేషంట్స్‌కు ముద్దులు ఇవ్వడం, నెమరడం, అనవసరమైన పరీక్షలు చేయించడం, అసభ్య వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రోగులతో డాక్టర్ కృష్ణ సింగ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్త్ లనార్క్‌షైర్‌లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మహిళా రోగులను సదరు డాక్టర్ లైంగికంగా వేధించినట్లు గ్లాస్గోలోని హైకోర్టులో ప్రాసిక్యూటర్ ఏంజిలా గ్రే వాదించారు. కాగా, 2018లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డాక్టర్ ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో కృష్ణ సింగ్ దోషిగా తేలాడు. ఇదిలా ఉండగా పేషెంట్లు చేసిన ఫిర్యాదులను సింగర్ తప్పుపట్టారు. ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో ఆ పరీక్షల గురించి నేర్చుకున్నట్లు సదరు డాక్టర్ చెప్పడం గమనార్హం. విచారణ అనంతరం ఈ కేసులో తీర్పును వచ్చే నెలకు వాయిదా వేశారు. -
వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు
ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్‌గా చెప్పలేం. తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసులు తనని ఇబ్బంది పెట్టారని..
స్కాట్లాండ్ : ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి తన వింత చేష్టలతో పోలీసులకు కోపం తెప్పించాడు. వారిని ఇబ్బందిపెట్టాలని చివరకు అతడే ఇబ్బందుల పాలయ్యాడు. ఈ సంఘటన స్కాట్లాండ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్కాట్లాండ్లోని అబర్డీన్షేర్కు చెందిన స్టువర్ట్ కుక్ రెండు రోజుల క్రితం ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతడికి బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి వద్ద గంజాయి వాసన రావటంతో వెతకటానికి ‘‘స్ట్రిప్ సెర్చింగ్’’ మొదలు పెట్టారు. తనను అరెస్ట్ చేయటం, చేతులకు బేడీలు వేయటంతో అసహనానికి గురైన స్టువర్ట్.. స్ట్రిప్ సెర్చింగ్ చేస్తున్న అధికారులే లక్ష్యంగా అపానవాయువు(గ్యాస్) వదలటం మొదలుపెట్టాడు. అలా ఒకసారి కాదు ఏకంగా మూడు సార్లు చేసి..‘ఇది మీకు నచ్చిందా’ అంటూ వారినే ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు కేసునమోదు చేసి అతడ్ని కోర్టుకు తరలించారు. అతడు చేసిన గణకార్యాన్ని న్యాయమూర్తికి వివరించారు. స్టువర్ట్ చర్యలకు కోపగించిన న్యాయస్థానం.. అతడితో 72 గంటల పాటు కఠినంగా పని చేయించుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు నిచ్చింది. -
ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది
గ్లాస్గో : అదో స్కాటిస్ బార్. ఓ మధ్యవయస్కుడు తన పక్కనున్న యువతితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి ఓ యువతి వచ్చింది. రావటంతోటే అతడిపై పంచులు కురిపించింది. లేడీ టైసన్లా మారి అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. అంతా డబ్ల్యూడబ్ల్యూఈలో లాగా జరిగిపోయింది. క్షణాల్లో అతడి ముఖం రక్తసిక్తమైంది. ఆమెనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు! కుదరలేదు. ఆమె పక్కకు జరగటంతో అతను మీదకు వెళ్లాడు. ఆమె మళ్లీ అతడిపై దాడి చేసింది. చివరకు అక్కడి వారు వారిద్దరినీ పట్టుకుని పక్కకు తీసుకుపోవటంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తనను రక్తం వచ్చేలా కొట్టినా అతడు ఆమెపై గట్టిగా చేయిచేసుకోకపోవటం గమనార్హం. జులై 13న గ్లాస్గోలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన్నులు తిన్న వ్యక్తి, చితక్కొట్టిన మహిళ ఎవరో తెలియరాలేదు. గ్లాస్గోకు చెందిన గేరీ మెకే అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే దీనిపై స్పందించిన స్కాట్లాండ్ పోలీసులు.. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియకుండా ఏమీ మాట్లాడలేమని తేల్చిచెప్పేశారు. -
విభజన వద్దు.. సమైక్యమే ముద్దు!
స్వాతంత్ర్యం కావాలా.. యూకేలోనే కలిసుంటారా అని అడిగితే స్కాట్లండ్ వాసులు సమైక్యానికే మొగ్గు చూపారు. దేశమంతా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తీర్పునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి స్కాట్లండ్ మొత్తమ్మీద 55.30 శాతం మంది వ్యతిరేకంగాను, 44.70 శాతం మంది అనుకూలంగాను స్పందించారు. అయితే.. స్కాట్లండ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, వద్దా అన్న విషయంలో రెఫరెండం నిర్వహించడం ఇది తొలిసారి ఏమీ కాదు. 1707 నుంచి యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న స్కాట్లండ్‌లో ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇదే అంశం గురించి రెఫరెండంలు జరిగాయి. అప్పుడు కూడా తాము సమైక్యంగానే ఉంటామని అక్కడి ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తీర్పు వచ్చింది. ఆండీ ముర్రే లాంటి టెన్నిస్ స్టార్లు, చివరకు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కూడా ఓటింగ్ జరగడానికి ముందు ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ముర్రే అయితే నేరుగా సమైక్యానికే ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఎలిజబెత్ రాణి మాత్రం మీకు మంచి చేసే నిర్ణయానికి ఓటేయండి అంటూ నర్మగర్భంగా చెప్పారు. అది కూడా స్కాట్లండ్ వాసుల మీద కొంతవరకు పనిచేసింది. మొత్తం 84.48 శాతం ఓట్లు పోలయ్యాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ ఈ రెఫరెండంను పర్యవేక్షించింది. ఇకవేళ ఈ రెఫరెండంలోనే విభజనకు అనుకూలంగా తీర్పు వస్తే.. 2016 మార్చి 24వ తేదీన స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా అవతరించేది. ఈ నిర్ణయాన్ని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు ప్రశంసించారు. నాలుగు జాతులతో కూడిన ఒక్క దేశంగానే ఉండటానికి స్కాట్లండ్ వాసుల తీర్పు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. We have heard the voice of Scotland and now the millions of voices of England must also be heard. #IndyRef — David Cameron (@David_Cameron) September 19, 2014 -
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....
గ్లాస్గో : స్కాంట్లాండ్లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. కాగా కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. 'యుగవ్' చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. విడిపోవడం ఎందుకు? బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు. యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. కలసి సాగడం ఎందుకు? విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్కు అవసరమని వాదిస్తున్నారు. -
మాకు స్వాతంత్ర్యం వద్దు: స్కాట్లండ్ తొలి ఫలితం
యూకే నుంచి విడిపోయి స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలా వద్దా అని నిర్వహించిన రిఫరెండంలో తొలి ఫలితం వచ్చింది. మూడు రాష్ట్రాలు దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. క్లాక్ మన్నన్ షైర్ అనే రాష్ట్రం తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఓటు వేసింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 89% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటేసిన వాళ్లలో 53.8% మంది స్వాతంత్ర్యం వద్దని, 46.2% మంది కావాలని కోరుకున్నారు. దాంతో ఆ రాష్ట్రం స్వాతంత్ర్యం వద్దనే చెప్పినట్లయింది. అలాగే ఆర్క్‌నీ అనే మరో రాష్ట్రం కూడా స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించకూడదనే చెప్పింది. ఇక్కడ మెజారిటీ మరింత ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం వద్దని 67% మంది చెప్పగా, కావాలని కేవలం 33% మందే చెప్పారు. షెట్లాండ్ రాష్ట్రం కూడా స్వాతంత్ర్యం వద్దని తేల్చింది. ఇక్కడ 63.7% మంది వద్దనగా 36.3% మంది స్వాతంత్ర్యం కావాలన్నారు. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే రెఫరెండం నిర్వహించడం గమనార్హం. స్కాట్లండ్ లో మొత్తం 32 రాష్ట్రాలున్నాయి. వీటన్నింటి ఫలితాలు ఇలా విడివిడిగా వస్తాయి. వాటిలో మెజారిటీ ఫలితం ఏదైతే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు అత్యధిక సంఖ్యలో రిఫరెండంలో పాల్గొని తమ ఓట్లు వేయడం గమనార్హం. డూండీ అనే రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైంది. మొత్తానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటూ ప్రదర్శనలు చేస్తున్న వారికి మాత్రం తొలి రెండు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.