పగలు ఫిజిక్స్‌ టీచర్‌.. రాత్రికి అడల్ట్‌ సైట్‌లో ఫొటోలు షేరింగ్‌.. ఎందుకో తెలుసా? | Physics Teacher Kirsty Buchan Resigns After Students Discover Photos | Sakshi
Sakshi News home page

పగలంతా పాఠాలు చెబుతుంది.. రాత్రి కాగానే అడల్ట్‌ సైట్‌లో ఫొటోలు పెడుతూ..

Published Sat, Dec 3 2022 9:15 PM | Last Updated on Sat, Dec 3 2022 9:20 PM

Physics Teacher Kirsty Buchan Resigns After Students Discover Photos - Sakshi

Physics Teacher kirsty buchan.. పగలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే చీచర్‌ ఆమె.. కానీ, రాత్రి అయితే మాత్రం ఆమె తన అర్ధనగ్న ఫొటోలను తీసుకుంటూ వాటిని అడల్ట్‌ సైట్స్‌లో పెడుతోంది. ఈ విషయం కాస్తా విద్యార్థులకు తెలియడంతో చివరకు టీచర్‌ జాబ్‌కు రాజీనామా చేసింది. 

వివరాల ప్రకారం.. స్కాట్‌లాండ్‌లోని బానర్మన్‌ హైస్కూల్‌లో క్రిస్టీ బూచన్‌ ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తోంది. దీంతో, ఆమె ఉదయం పూట కొన్ని సంవర్సతరాలుగా పిల్లలకు ఫిజిక్స్‌ పాఠాలు బోధిస్తోంది. కానీ, రాత్రి అవగానే ఆమె మరో పని కూడా చేస్తూ విద్యార్థుల కంటపడకుండా జాగ్రత్తపడింది. కాగా, రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటూ ఓన్లీ ఫ్యాన్స్‌ అనే అడల్ట్‌ వెబ్‌సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్‌ చేసేది. వెబ్‌సైట్లో పోస్ట్‌ చేసేందుకు ఫొటో షూట్‌ నిర్వహించుకుని వాటిని సైట్‌లో పోస్ట్‌ చేసేది. ఇలా చేయడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. 

అయితే, టైమ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. దొరకనంత వరకూ దొర.. దొరికిన తర్వాత ఎంతటి వారినైనా దొంగే అంటారనే సమేత ఉంది కదా. ఆమెకు ఇదే సమెత వర్తించింది. ఇలా చేస్తున్న క్రమంలో సదరు ఫిజిక్స్‌ టీచర్‌ ఫొటోలు ఓ విద్యార్థి కంటపడ్డాయి. దీంతో, అతడు ఈ విషయాన్ని స్కూల్‌లో అందరికీ చెప్పేశాడు. దీంతో, స్కూల్‌ క్రమశిక్షణా కమిటీ ఆమెను విచారణకు రావాలని కోరింది. ఈ క్రమంలో వారు.. తనను తప్పుబట్టేది ఏంటని.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. 

ఫొటోలు పోస్టు చేయడానికి కారణమిదే..
అయితే, ఫిజిక్స్‌ టీచర్‌ క్రిస్టీ బూచన్‌కు కుమారుడు(11) ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు డబ్బు సరిపోకపోవడంతో తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుమారుడికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సర్జరీలకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇలా, నగ్న చిత్రాలను పోస్ట్‌ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నట్టు పేర్కొంది. ఆ పని చేస్తున్నందుకు తాను నరకం అనుభవిస్తున్నానని వెల్లడించింది. ఉదయం టీచర్‌ పనిచేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి కోసం తాను కరెక్ట్‌గానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement