physics teacher
-
ఇదేం ‘లెక్క’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఫిజిక్స్ టీచర్లు ఇక నుంచి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్యాయమంటూ ఫిజిక్స్ టీచర్లు ఉన్నతాధికారులను కలిశారు. దీనివల్ల తమకు తీవ్ర మానసికఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పనిగంటలు ఉంటాయని, తామే ఎక్కువ గంటలు పనిచేస్తామని, అయినా అదనంగా గణితం బోధించమనడం ఏమిటని ప్రశ్నించారు. అసలిది పాత విషయమేనని అనవసరంగా పెద్దది చేస్తున్నారని గణితం టీచర్లు అంటున్నారు. పరస్పర వాదనల నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్య తలెత్తుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలూ ఆందోళన చెందుతున్నాయి. అసలేంటీ పంచాయితీ గతంలో ఫిజిక్స్ సబ్జెక్టు గణితం వారు, కెమిస్ట్రీ సబ్జెక్టు బయలాజికల్ సైన్స్ వారు చెప్పేవారు. 2000లో ఫిజికల్ సైన్స్ పోస్టులు మంజూరు చేసి, 2002లో భర్తీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఓ టైంటేబుల్తో సర్క్యులర్ ఇచ్చింది. ఇందులో 8, 9, 10 ఫిజిక్స్ చెప్పాలని, 6, 7 తరగతులకు గణితం చెప్పాలని పేర్కొంది. 2017 వరకూ ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత సిలబస్‌లో మార్పులొచ్చాయి. గణితం వారికి ఎక్కువ బోధన, సైన్స్ వారికి తక్కువ బోధన క్లాసులు ఉన్నాయనే వాదన తెరమీదకొచ్చింది.అప్పట్లో ఎస్ఈఆర్టీ 2017లో 6వ తరగతి గణితంను ఫిజిక్స్ టీచర్లు, 7వ తరగతి గణితంను 10 వరకూ చెప్పే గణితం టీచర్లే చెప్పాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గణితం టీచర్లు ఆందోళనకు దిగారు. గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది ఫెయిల్ అ వుతున్నారని, మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. దీంతో ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ఆదేశాలు నిలిపివేసింది. అప్పట్నుంచీ వివాదం అలాగే కొనసాగింది. స్థానిక హెచ్ఎంలు సర్దుబాటు చేసుకొని క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా మళ్లీ ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 క్లాసుల గణితం చెప్పాలని ఆదేశాలివ్వడంతో వివాదం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పం ఎట్టి పరిస్థితుల్లోనూ 6, 7 తరగతులకు గణితం సబ్జెక్టు బోధించం. దీనివల్ల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సైన్స్ యాక్టివిటీ అయిన ఇన్స్పైర్ అవార్డులు, స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్,, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ తదితర ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం కష్టం. గణితం కన్నా భౌతిక, రసాయన శా్రస్తాల బోధనే కష్టం. డిగ్రీలో, బీఈడీలో గణితం చదవాలన్న అర్హత నిబంధనలు లేవు. ఇలా గణితం నేపథ్యం లేని ఫిజిక్స్ అధ్యాపకులూ ఉన్నారు. వారిని గణితం బోధించమంటే ఎలా వీలవుతుంది? తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – అజయ్‌సింగ్, రాష్ట్ర ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం అధ్యక్షుడు జరిగే నష్టం ఏమిటి?ప్రభుత్వ ఉపాధ్యాయులు బీఈడీ చేసిన సమయంలో ఇప్పుడున్న సిలబస్ లేదు. ఈ కారణంగా ఫిజిక్స్ మినహా 6, 7 తరగతుల గణితం చెప్పాలంటే కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సమయాన్ని ఇలా వెచి్చస్తే కీలకమైన 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. జాతీయస్థాయిలో జరిగే నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు 8వ తరగతి నుంచే సైన్స్‌లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్ టీచర్లు చెబుతున్నారు.రాష్ట్రంలో ఉన్న టీచర్లలో 25 శాతం మంది ఫిజిక్స్ టీచర్లు ఉన్నారు. వీరికన్నా 20 శాతం గణితం టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు వారికే 6,7 మేథ్స్ బోధన అప్పగించాలని కోరుతున్నారు. స్కూళ్లు తెరిచేలోగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. -
ఫిజిక్స్‌వాలా: గెలవాలంటే అజ్ఞానం కూడా అవసరమే!
సక్సెస్ కావాలంటే అజ్ఞానం కూడా ఉండాలి అంటారు ఫిజిక్స్‌వాలా ఫేమ్ అలక్ పాండే. అతడి మాటల తాత్పర్యం.. నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడూ ఏమి తెలుసుకోలేము ఏమి తెలియదు అనుకున్నప్పుడే అన్ని తెలసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. అదే విజయానికి దారి చూపుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో ట్యూషన్లు చెప్పి కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళలా సహకరించిన స్టార్ ఎంటర్ప్రెన్యూసర్ అతడి ఎడ్టెక్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా శాఖోపశాఖలుగా విస్తరించి యూనికార్స్ క్లబ్లో చేరింది. సక్సెస్వాలా స్ట్రాంగ్ స్టోరీ. పాఠాలను పాఠాలుగా మాత్రమే బోధించాలని లేదు. వాటిని నిజజీవితంలోకి తీసుకువచ్చి, హాస్యం జోడించి చెబితే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ‘ఫిక్షనుకు ఫ్రిక్షన్కు తేడా ఏమిటి?’ నుంచి జటిలమైన భౌతికసూత్రాలను సులభంగా చెప్పడం వరకు అలక్ పాండే అద్భుతమైన నేర్పును సాధించాడు. ఈ ఫస్ట్–జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కొన్ని సంవత్సరాల క్రితం ‘ఫిజిక్స్‌వాలా’ పేరుతో ఫ్రీ యూట్యూబ్ చానల్‌కు శ్రీకారం చుట్టాడు. ‘పెద్ద సక్సెస్ సాధించబోతున్నాను’ అని ఆ సమయంలో అతను అనుకొని ఉండడు. అతడు అనుకున్నా, అనుకోకపోయినా ‘ఇస్రో’వారి రాకెట్లా ఫిజిక్స్‌వాలా దూసుకుపోయింది. 31 మిలియన్ల సబ్స్రైబర్లు, 61 యూట్యూబ్ చానల్స్, 5.3 బిలియన్ వ్యూస్! ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మేలు’ అనుకునే రకం కాదు అలక్. ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు మనదైన స్టైల్‌ను బయటికి తీయాలి’ అని బలంగా నమ్ముతాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం నుంచి వచ్చిన అలక్ ‘మాకు ప్రతి రపాయి వందరపాయలతో సవనంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అలక్ ఎడ్టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తాను వేసుకున్న ప్రశ్న ‘స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?’ ఈ ప్రశ్నకు ఊహల్లో నుంచి సమాధానం తీసుకోకుండా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాడ్లాడాడు. వారు చెప్పిన ప్రతీదాన్ని నోట్ చేసుకొని లైవ్ ఆన్లైన్ కాసులలో అప్లై చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కోంగ్ సెంటర్ల ద్వారా బాగా డబ్బు గడింన అలక్ పాండేకు ‘ఫిజిక్స్‌వాలా’ చానల్ ద్వారా వచ్చిన యాడ్ మనీ ఎనిమిది వేలు చాలా తక్కువ. అయితే ఇది ‘శుభారంభం’ అని వత్రమే అనుకున్నాడు అలక్. అతడి నమ్మకం వృథా పోలేదు యాడ్ మనీ ఊహించని స్థాయిలో పెరుగుతూ పోయింది. కొన్నిసార్లు విద్యార్థులే ఉపాధ్యాయులై చక్కని సలహాలు ఇస్తారు. కొత్తలో అలక్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్డాడు. ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంతగా సక్సెస్ అవుతాం అనుకునేవాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు... ‘యాడ్స్ మీద కాదు టీచింగ్ మీద దృష్టి పెట్టండి’ అని చెప్పారు. ఇక అప్పటి నుం యాడ్స్‌పై కాకుండా టీచింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ‘ఫిజిక్స్‌వాలా క్లాస్‌లలో చక్కగా అర్థమవుతుంది’ అనే మౌత్‌టాక్ వచ్చేలా కృషి చేశాడు. చాలామంది విజేతలలాగే అలక్ పాండేకు ఎదురయ్యే ప్రశ్న.... ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అది చెప్పడానికి అలక్ నోరు విప్పనక్కర్లేదు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనంలోని అతని ఆఫీసు గోడపై అతికించిన పోస్టర్లు చూస్తే చాలు. మచ్చుకు రెండు... ‘సక్సెస్ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్ బీ గురించిన ఆలోచనే రాదు’ ‘వేగంగా పరాజయం పాలైనా సరే, నిదానంగా గట్టి విజయం సాధించాలి’. (చదవండి: మిస్ యూ భయ్యా! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!) -
పగలు ఫిజిక్స్ టీచర్.. రాత్రికి అడల్ట్ సైట్లో ఫొటోలు షేరింగ్.. ఎందుకో తెలుసా?
Physics Teacher kirsty buchan.. పగలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే చీచర్ ఆమె.. కానీ, రాత్రి అయితే మాత్రం ఆమె తన అర్ధనగ్న ఫొటోలను తీసుకుంటూ వాటిని అడల్ట్ సైట్స్‌లో పెడుతోంది. ఈ విషయం కాస్తా విద్యార్థులకు తెలియడంతో చివరకు టీచర్ జాబ్‌కు రాజీనామా చేసింది. వివరాల ప్రకారం.. స్కాట్లాండ్లోని బానర్మన్ హైస్కూల్లో క్రిస్టీ బూచన్ ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తోంది. దీంతో, ఆమె ఉదయం పూట కొన్ని సంవర్సతరాలుగా పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తోంది. కానీ, రాత్రి అవగానే ఆమె మరో పని కూడా చేస్తూ విద్యార్థుల కంటపడకుండా జాగ్రత్తపడింది. కాగా, రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటూ ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసేది. వెబ్సైట్లో పోస్ట్ చేసేందుకు ఫొటో షూట్ నిర్వహించుకుని వాటిని సైట్లో పోస్ట్ చేసేది. ఇలా చేయడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. అయితే, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. దొరకనంత వరకూ దొర.. దొరికిన తర్వాత ఎంతటి వారినైనా దొంగే అంటారనే సమేత ఉంది కదా. ఆమెకు ఇదే సమెత వర్తించింది. ఇలా చేస్తున్న క్రమంలో సదరు ఫిజిక్స్ టీచర్ ఫొటోలు ఓ విద్యార్థి కంటపడ్డాయి. దీంతో, అతడు ఈ విషయాన్ని స్కూల్లో అందరికీ చెప్పేశాడు. దీంతో, స్కూల్ క్రమశిక్షణా కమిటీ ఆమెను విచారణకు రావాలని కోరింది. ఈ క్రమంలో వారు.. తనను తప్పుబట్టేది ఏంటని.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫొటోలు పోస్టు చేయడానికి కారణమిదే.. అయితే, ఫిజిక్స్ టీచర్ క్రిస్టీ బూచన్కు కుమారుడు(11) ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు డబ్బు సరిపోకపోవడంతో తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుమారుడికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సర్జరీలకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇలా, నగ్న చిత్రాలను పోస్ట్ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నట్టు పేర్కొంది. ఆ పని చేస్తున్నందుకు తాను నరకం అనుభవిస్తున్నానని వెల్లడించింది. ఉదయం టీచర్ పనిచేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి కోసం తాను కరెక్ట్‌గానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. A physics teacher has resigned from her job after pornographic images of her emerged online. Kirsty Buchan, 33, left her post at Bannerman High School in Baillieston, Glasgow, after explicit pictures from her Only Fans site were circulated among pupils. pic.twitter.com/tuBFfUU3qR — vijay banga (@lekh27) December 1, 2022 -
సైన్స్‌లోకి అమ్మాయా!
‘సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అమ్మాయిలా..’ అని రోహిణిని చూసి అప్పటివారు అనుకుంటే.. సైన్స్ అండ్ టెక్నాలజీలో అమ్మాయిలు లేకపోవడం ఏంటి అన్నట్లు రోహిణి ఆనాడు తన కాలేజ్ క్యాంపస్‌ను చూశారు. పార్టికల్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసినప్పుడు తొలిసారి రోహిణీ గోడ్బోలేను భారతీయ భౌతిక శాస్త్ర పండితులుసాలోచనగా తలపంకిస్తూ ఆమె వైపు చూశారు. ఒక అమ్మాయి! అదీ ఫిజిక్స్‌లో! అదీ ఉపాణుకణ స్వభావాలపై! అదీ న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో! ఆ పీహెచ్‌డీకి ముందు ముంబైలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుంచి సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీతో బయటికి వచ్చారు రోహిణీ. అప్పుడూ అంతే. అప్పుడు అంటే.. డెబ్బైలలో. ఒక అమ్మాయి! అదీ సైన్స్‌లో! అదీ ఐఐటీ ముంబైలో!! రోహిణీ గాడ్బోలే 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరినప్పుడు కూడా సహ పురుష లెక్చరర్లు కళ్లు మెరిసే వింతగా ఆమెను చూశారు. రోహిణికి మాత్రం నీరసం, నిరుత్సాహం. క్లాస్ రూముల్లో గుప్పెడు మందైనా అమ్మాయిలు ఉంటేనా! సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అమ్మాయిలా.. అని రోహిణిని చూసి అప్పటివారు అనుకుంటే.. సైన్స్ అండ్ టెక్నాలజీలో అమ్మాయిలు లేకపోవడం ఏంటి అని రోహిణి చూశారు. నాటి నుంచీ నేటి వరకు ఒక భౌతిక శాస్త్ర పరిశోధకురాలిగా, ప్రొఫెసర్‌గా.. అమ్మాయిల్ని శాస్త్ర సాంకేతిక రంగాల విద్య, అధ్యయనాలవైపు ప్రోత్సహిస్తూనే ఉన్నారు రోహిణి. ఆ కృషికి గుర్తింపే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఫ్రెంచ్ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అవార్డుకు ఆమె ఎంపిక అవడం. అంతర్జాతీయ పురస్కారం ఇది. గౌరవ కారణం కూడా. ‘భౌతికశాస్త్ర విద్య, అధ్యయన రంగాలలో ఇండో–ఫ్రాన్స్ సంబంధాలపురోగతికి, సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు అమ్మాయిలకు ఆసక్తి, ప్రేరణ కలిగించే విధంగా ఫలవంతమైన ప్రయత్నాలు చేసినందుకు..’ రోహిణికి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ∙ ∙ సైన్స్ చదవాలని ఉత్సాహంగా కాలేజ్‌లో చేరిన అమ్మాయిలు ఆ తర్వాత పై చదువులకు వెళ్లకుండా ఎలా మెల్లిమెల్లిగా సైన్స్‌కు దూరం అవుతున్నారో రోహిణి దగ్గర స్పష్టమైన డేటా ఉంది. ‘‘కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వెళ్లే లోపు 10 శాతం మంది అమ్మాయిలు తగ్గిపోతున్నారు. యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కి వెళ్లేలోపు 5 శాతం తగ్గిపోతున్నారు. పీహెచ్డీ అయ్యాక కెరీర్ ఎంచుకునేలోపు 15 శాతం మంది తగ్గిపోతున్నారు’’ అని రోహిణి అధ్యయనంలో వెల్లడయింది. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఆమె ప్రొఫెసర్‌గానే కాకుండా, ‘టెడెక్స్’ వక్తగానూ అనేక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. ఆమె జీవిత లక్ష్యం సైన్స్ అధ్యయనాల్లో అమ్మాయిల సంఖ్యను, శాతాన్ని పెంచడం. స్వయంగా ఆమే అమ్మాయిలకొక ఆదర్శం. సైన్స్‌లో రోహిణి ఇప్పటివరకు 100కు పైగా అధ్యయన పత్రాలను సమర్పించారు. జె.సి.బోస్ ఫెలోషిప్ ఉంది. రోహిణి 1995లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్ గా చేరారు. ప్రస్తుతం అక్కడే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘పద్మశ్రీ’ రావడం, ‘యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్’ (సి.ఇ.ఆర్.ఎన్.)లో చేసిన అధ్యయనాలు... ఆమె కెరీర్‌లోని అత్యున్నతస్థాయులు. ఇప్పుడు వాటికి ఫ్రెంచ్ అవార్డు జత కలిసింది. ఒక మామూలు అమ్మాయి సైన్స్‌లో ఇన్ని శిఖరాగ్రాలు చేరుకోడాన్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి గొప్ప విషయంగానే భావించాలి. రోహిణి 1952లో పుణెలో పుట్టారు. తండ్రి మధుసూదన్ గణేశ్ గాడ్బోలే. తల్లి మాలతీ దండేకర్. స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా ఆమె తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నారు. ‘‘సైన్స్ విద్య, అధ్యయన, ఉద్యోగ రంగాలలోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రభుత్వ విధానాలు, సామాజిక దృష్టిలో మార్పులు రావాలి’’ అని రోహిణి గోడ్బోలే కోరుకుంటున్నారు. -
8వ తరగతి విద్యార్థిని పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వనస్థలిపురంలోని సదరు స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసే హేమకుమార్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా సదరు విద్యార్థిని చీర కట్టుకుని వచ్చింది. కాగా హేమకుమార్ ఆ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో... బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ వద్దకు చేరుకుని అద్దాలు ధ్వంసం చేశారు.