దసన్ శనక సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన శ్రీలంక.. 9వ జట్టుగా ప్రధాన టోర్నీలో అడుగుపెట్టనుంది.
ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫయర్-2 జట్టుగా శ్రీలంక అర్హత సాధించింది. వాస్తవానికి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన వాంఖడే మైదానంలో భారత్ క్వాలిఫయర్-2 జట్టుతో తలపడనుంది. ఇప్పుడు శ్రీలంక క్వాలిఫయర్-2 జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టడంతో మరోసారి ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
4597 రోజుల తర్వాత...
ఇక 4597 రోజుల తర్వాత తొలిసారి ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్-శ్రీలంక మ్యాచ్‌కు వేదిక కానుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే వాఖండే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయంతో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ధోని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఏప్రిల్ 2, 2011న భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
జింబాబ్వే-స్కాట్లాండ్ ఫైట్
ఇక వన్డే ప్రపంచకప్‌లో రెండో జట్టుగా అడుగుపెట్టేందుకు జింబాబ్వే-స్కాట్లాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జింబాబ్వే 6 పాయింట్లతో ఉండగా, స్కాట్లాండ్ 4 పాయింట్లతో ఉంది. జూలై 4న హరారే వేదికగా జింబాబ్వే-స్కాట్లాండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే జింబాబ్వేతో సమంగా నిలుస్తోంది. అప్పుడు నెట్‌రన్ రేట్ కీలకం కానుంది. అయితే జింబాబ్వే(+0.030) కంటే స్కాట్లాండ్(+0.188) రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి స్కాటిష్ జట్టు క్వాలిఫయర్-1గా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.
చదవండి: IND vs WI: బీచ్‌లో వాలీబాల్ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment