ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ కు అర్హత సాధించింది. తద్వారా భారత్ వేదికగా జరగనున్న వన్డేప్రపంచకప్-2023కు శ్రీలంక క్వాలిఫై అయింది.
ఫైనల్‌కు చేరిన రెండు జట్లు ప్రధాన టోర్నీలో భాగం కానున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(57 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు.
శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో చెలరేగగా.. మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు సాధించారు. అనంతరం 166 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సంక(101) అజేయ శతకంతో చెలరేగాడు. అతడితో పాటు కరుణరత్నే(30) రాణించాడు.
చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
Comments
Please login to add a commentAdd a comment