
స్టువర్ట్ కుక్
దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు అతడ్ని..
స్కాట్‌లాండ్ : ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి తన వింత చేష్టలతో పోలీసులకు కోపం తెప్పించాడు. వారిని ఇబ్బందిపెట్టాలని చివరకు అతడే ఇబ్బందుల పాలయ్యాడు. ఈ సంఘటన స్కాట్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్కాట్‌లాండ్‌లోని అబర్డీన్‌షేర్‌కు చెందిన స్టువర్ట్ కుక్ రెండు రోజుల క్రితం ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతడికి బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి వద్ద గంజాయి వాసన రావటంతో వెతకటానికి ‘‘స్ట్రిప్ సెర్చింగ్’’ మొదలు పెట్టారు. తనను అరెస్ట్ చేయటం, చేతులకు బేడీలు వేయటంతో అసహనానికి గురైన స్టువర్ట్.. స్ట్రిప్ సెర్చింగ్ చేస్తున్న అధికారులే లక్ష్యంగా అపానవాయువు(గ్యాస్) వదలటం మొదలుపెట్టాడు.
అలా ఒకసారి కాదు ఏకంగా మూడు సార్లు చేసి..‘ఇది మీకు నచ్చిందా’ అంటూ వారినే ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు కేసునమోదు చేసి అతడ్ని కోర్టుకు తరలించారు. అతడు చేసిన గణకార్యాన్ని న్యాయమూర్తికి వివరించారు. స్టువర్ట్ చర్యలకు కోపగించిన న్యాయస్థానం.. అతడితో 72 గంటల పాటు కఠినంగా పని చేయించుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు నిచ్చింది.