strip search
-
పోలీసులు తనని ఇబ్బంది పెట్టారని..
స్కాట్లాండ్ : ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తి తన వింత చేష్టలతో పోలీసులకు కోపం తెప్పించాడు. వారిని ఇబ్బందిపెట్టాలని చివరకు అతడే ఇబ్బందుల పాలయ్యాడు. ఈ సంఘటన స్కాట్లాండ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్కాట్లాండ్లోని అబర్డీన్షేర్కు చెందిన స్టువర్ట్ కుక్ రెండు రోజుల క్రితం ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతడికి బేడీలు వేసి స్టేషన్కు తరలించారు. అనంతరం అతడి వద్ద గంజాయి వాసన రావటంతో వెతకటానికి ‘‘స్ట్రిప్ సెర్చింగ్’’ మొదలు పెట్టారు. తనను అరెస్ట్ చేయటం, చేతులకు బేడీలు వేయటంతో అసహనానికి గురైన స్టువర్ట్.. స్ట్రిప్ సెర్చింగ్ చేస్తున్న అధికారులే లక్ష్యంగా అపానవాయువు(గ్యాస్) వదలటం మొదలుపెట్టాడు. అలా ఒకసారి కాదు ఏకంగా మూడు సార్లు చేసి..‘ఇది మీకు నచ్చిందా’ అంటూ వారినే ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు కేసునమోదు చేసి అతడ్ని కోర్టుకు తరలించారు. అతడు చేసిన గణకార్యాన్ని న్యాయమూర్తికి వివరించారు. స్టువర్ట్ చర్యలకు కోపగించిన న్యాయస్థానం.. అతడితో 72 గంటల పాటు కఠినంగా పని చేయించుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు నిచ్చింది. -
ఆ వీడియో దేవయానిది కాదు: అమెరికా
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తున్నట్లుగా వివిధ వెబ్సైట్లలో కనిపించిన, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న సీసీటీవీ వీడియో సంచలనం రేపుతోంది. ఆమె రెండు చేతులను వెనక్కు విరిచి, నగ్నంగా పాడుకోబెట్టి తనిఖీ చేస్తున్నట్టు వీడియాలో ఉంది. పురుష భద్రతాధికారులు ఆమెను వేధిస్తున్నట్టుగా అందులో చూపారు. అయితే ఈ వీడియో బూటకమైనదని అమెరికా విదేశాంగ శాఖ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ పేర్కొన్నారు. ‘‘ఆ వీడియో ఎంతమాత్రమూ ఖోబ్రగడేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన, రెచ్చగొట్టేటువంటి కల్పితమైన వీడియో’’ అని చెప్పారు. అమెరికా పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై విదేశాంగ అధికారులు అమెరికా మార్షల్ సర్వీస్ విభాగంతో మాట్లాడారని, ఆ వీడియో దేవయానిది కాదని వారు నిర్ధారించారని మేరీ హార్ఫ్ చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది అమెరికా మార్షల్స్ కాదని, ఆ వీడియోలో కనిపించిన తనిఖీ పద్ధతి కూడా అమెరికా మార్షల్స్ పాటించే విధానంలో లేదని వారు ధ్రువీకరించినట్లు చెప్పారు.