Afghanistan Batter Sediqullah Atal Smashes 7 Sixes in 48 Run Over - Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్‌

Published Sun, Jul 30 2023 8:27 AM | Last Updated on Sun, Jul 30 2023 11:45 AM

Afghanistan batter Sediqullah Atal smashes 7 sixes in 48 run over - Sakshi

టీ20 క్రికెట్‌లో ఆఫ్గాన్‌ బ్యాటర్‌ సెదిఖుల్లా అటల్ సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లతో 42 పరుగులు రాబట్టి రికార్డులకెక్కాడు. ఆఫ్గానిస్తాన్‌ వేదికగా జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్‌ ఈ సంచలనానికి వేదికైంది. ఈ లీగ్‌లో షహీన్ హంటర్స్‌కు అటల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అబాసిన్ డిఫెండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అటల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

హంటర్స్‌ ఇన్నింగ్స్‌ 19 ఓ‍వర్‌లో వేసిన అమీర్ జజాయ్  బౌలింగ్‌లో అటల్ ఈ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో జజాయ్‌ మొదటి బంతిని నోబాల్‌ వేయగా అటల్‌ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతి వైడ్ ఫోరు గా వెళ్ళింది. దీనితో బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన 6 బంతులను అటల్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 48 పరుగులు వచ్చాయి.

ఓవరాల్‌గా ఆ ఓవర్‌లో 7 సిక్సర్లు,  1 నోబాల్, 1 వైడ్ అండ్‌ ఫోర్ వచ్చాయి. ఓవరాల్‌గా అటల్‌  56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు.  కాగా టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదడం ఇదే తొలి సారి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జజాయ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా షాహిన్ హంటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. 214 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక సెదీఖుల్లా అటల్ అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

రుత్‌రాజ్‌ కూడా..
కాగా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్ల కొట్టిన ఘనత  అంతుకుముందు భారత యువ ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ కూడా సాధించాడు. కానీ అది 50 ఓవర్ల ఫార్మాట్‌లో కావడం గమనార్హం. గతేడాది జయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వరుసగా 7 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర బౌలర్ శివసింగ్ వేసిన  ఓవర్ లో రుతురాజ్ 7 సిక్సులు బాదాడు. తొలి  ఆరు బంతులను సిక్సర్లగా మలిచిన రుతు..  ఆ ఓవర్ లో పడిన నోబాల్ ను స్టాండ్స్ లోకి  పంపించాడు.

చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement