టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్ఢింగ్ సరిగా చేయలేడు అనే అపవాదు ఒకటి ఉండేది. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకోవడం అరుదు. బ్యాట్స్‌మన్‌గా క్రీజులో పరుగులు తీయడానికి పెద్దగా ఇష్టపడని రోహిత్.. ఫీల్డింగ్‌లోనూ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మాత్రం టీమిండియా కెప్టెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 34 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్ ఎలాంటి సందేహాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేశాడు.
చదవండి: రోహిత్ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయి.. తొలి మ్యాచ్ కదా వదిలేయ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టి20లో విండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను హర్షల్ పటేల్ వేశాడు. ఓడియన్ స్మిత్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. లాంగాఫ్ నుంచి సూర్యకుమార్ పరిగెత్తుకు రాగా.. ఎక్స్‌ట్రా కవర్ నుంచి రోహిత్ వెనుకకు పరిగెత్తుతూ డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రోహిత్.. అటు సూర్యకుమార్‌తో పాటు మిగతా ఆటగాళ్లను, కామెంటేటర్లను .. స్టన్నింగ్ క్యాచ్‌తో షాక్‌కు గురిచేశాడు. రోహిత్ క్యాచ్‌కు క్రీడా పండితులు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ స్టన్నింగ్ ఫీట్ చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కెప్టెన్ అయ్యాకా కొత్త రోహిత్ కనిపిస్తున్నాడు.. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అనే అపవాదు ఉండేది.. ఇప్పుడది పటాపంచలు అయింది అంటూ కామెంట్ చేశారు.
చదవండి: IND Vs WI: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా
Comments
Please login to add a commentAdd a comment