PC:IPL.com
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది.
గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతమకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ధోని సూపర్ క్యాచ్..
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన వికెట్ కీపింగ్‌తో ఔరా అన్పించాడు. అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను ధోని పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో డారిల్ మిచెల్ మూడో బంతిని విజయ్ శంకర్‌కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు.
ఈ క్రమంలో విజయ్ శంకర్ వర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుత పులిలా డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎
— IndianPremierLeague (@IPL) March 26, 2024
An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg
Comments
Please login to add a commentAdd a comment