
Shimron Hetmyer Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికి హెట్‌మైర్ మాత్రం స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ రెండో బంతిని దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ డీప్‌స్కేర్ లెగ్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే అక్కడే ఉన్న హెట్‌మైర్ ముందుకు పరిగెత్తుకొచ్చి కిందకు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు.
చదవండి: WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
అయితే ఔట్ విషయంలో అంపైర్ క్లారిటీ లేకపోవడంతో థర్ఢ్‌అంపైర్‌కు వెళ్లింది. సాఫ్ట్ సిగ్నల్‌లో నాటౌట్ అని చూపించగా.. రిప్లేలో మాత్రం బంతి ఎక్కడా నేలకు తగిలినట్లు కనిపించలేదు. హెట్‌మైర్ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని తన చేతివేళ్ల మధ్యలో పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో రీజా హెండ్రిక్స్ ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
An excellent low diving catch by Hetmyer https://t.co/N3Up6TCnhn via @t20wc
— varun seggari (@SeggariVarun) October 26, 2021
Comments
Please login to add a commentAdd a comment