టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎలాంటి ఫీల్డర్అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మెరుపు ఫీల్డింగ్‌తో పలుమార్లు రనౌట్లు.. మరి కొన్నిసార్లు అద్బుత క్యాచ్‌లు అందుకున్నాడు. బెస్ట్ ఫీల్డర్‌గా ముద్రపడిన జడేజా తాజాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్‌లో తన విన్యాసాలు రుచి చూపించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్, లివింగ్‌స్టోన్ క్యాచ్‌లు తీసుకోగా.. ఇందులో బట్లర్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు.
అప్పటికే జాస్ బట్లర్ అర్థసెంచరీ పూర్తి చేసుకొని దాటిగా ఆడడం మొదలెట్టాడు. అతనికి తోడుగా లివింగ్‌స్టోన్ కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతుందన్న తరుణంలో హార్దిక్ మ్యాజిక్ చేశాడు. హార్దిక్ షార్ట్‌బాల్ వేయగా.. బట్లర్ డీప్‌స్వ్కేర్ లెగ్ మీదుగా భారీషాట్ ఆడాడు. బౌండరీ అనుకున్న తరుణంలో దాదాపు 25 గజాల దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన జడేజా మొత్తం ఎడమవైపునకు తిరిగి డైవ్ చేస్తూ అద్బుత క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు లివింగ్‌స్టోన్ క్యాచ్ కూడా జడేజా దాదాపు ఇదే తరహాలో అందుకోవడం విశేషం.
A fine catch from Jadeja removes Buttler.
— England Cricket (@englandcricket) July 17, 2022
Scorecard/clips: https://t.co/2efir2v7RD
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/5zIQnQ8Nh4
చదవండి: Kohli-Siraj: రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్‌లో సిరాజ్ బౌలింగ్.. ఫలితం!
Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్‌స్ట్రక్షన్ సైట్‌లోకి బంతి'
Comments
Please login to add a commentAdd a comment