ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ 2022 టోర్నమెంట్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాస్ బట్లర్ కొట్టిన ఒక బంతి ఆరు సెకన్ల పాటు గాల్లోనే ఉంది. ఇది సూపర్ అని మనం భావించేలోపే వెంటనే మరొక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను మాసన్ క్రేన్ ఒంటిచేత్తో డైవ్ చేస్తూ తీసుకున్నాడు. ఇలా సెకన్ల వ్యవధిలోనే రెండు అద్భుతాలు జరిగాయి.
విషయంలోకి వెళితే.. సోమవారం లండన్ స్పిరిట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్ జోర్డాన్ థాంప్సన్ వేశాడు. అప్పటికే బట్లర్ 10 బంతుల్లో ఆరు పరుగులతో ఆడుతున్నాడు. కాగా భారీ షాట్లకు పెట్టింది పేరైనా బట్లర్ థాంప్సన్ వేసిన నాలుగో బంతిని గాల్లోకి లేపాడు. దాదాపు ఆరు సెకన్ల పాటు బంతి గాల్లోనే ఉండడం విశేషం. కచ్చితంగా సిక్స్ అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా బంతి గ్రౌండ్ పరిధిలోనే ఉండడం.. మాసక్ క్రేన్ పరిగెత్తుకొచ్చి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే డేంజర్ బ్యాటర్ అయిన బట్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పొలార్డ్ హిట్టింగ్‌తో లండన్ స్పిరిట్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(37 పరుగులు), ఓపెనర్ జాక్ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్ జోర్డాన్ థాంప్సన్(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.
Mason Crane. Wow. 🤯#TheHundred | @masoncrane32 pic.twitter.com/Rycid40AsX
— The Hundred (@thehundred) August 9, 2022
చదవండి: Roger Federer: చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు
CWG 2022- Virat Kohli: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం.. కంగ్రాట్స్: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment