
Photo: IPL Twitter
సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. తానే బౌలింగ్ చేసి తానే క్యాచ్ తీసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కామెరున్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అద్బుత రీతిలో తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన జడేజా రెండో బంతిని ఫ్లైటెడ్ డెలివరీ వేశాడు.
కామెరున్ గ్రీన్ కవర్స్ దిశగా ఆడుదామని ప్రయత్నించి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే జడేజా చేతులు అడ్డుపెట్టి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో జడేజా క్యాచ్‌ను తీసుకున్నాడు. అంతే గ్రీన్ ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Now THAT'S what you call a blinder, courtesy Ravindra Jadeja 🤯#MIvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @imjadeja pic.twitter.com/NpJRXhBvtJ
— JioCinema (@JioCinema) April 8, 2023