భువీ డెడ్లీ ఇన్‌స్వింగర్.. బట్లర్ బౌల్డ్(Photo Credit: SonyLiv/Twitter)
India Vs England 1st T20: ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. టీమిండియా విధించిన 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను మొదటి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. గత కొన్ని నెలలుగా భీకర ఫామ్ కొనసాగిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బట్లర్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ఐదో బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. బట్లర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కాగా భువీ ఇన్‌స్వింగర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘మళ్లీ పాత భువీని చూస్తున్నాం.. చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ బట్లర్‌ను భువీ అవుట్ చేసి ఉండకపోతే కచ్చితంగా పరిస్థితి వేరేలా ఉండేది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 148 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భువీ 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్:
టాస్: ఇండియా- బ్యాటింగ్
ఇండియా స్కోరు: 198/8 (20)
ఇంగ్లండ్ స్కోరు: 148 (19.3)
విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)
చదవండి: Ind Vs Eng 1st T20: టీమిండియా.. మరీ ఇంత చెత్తగానా.. ఇదేం బాలేదు!
#TeamIndia post a total of 198/8 in 20 overs 🏏 #ENGvIND pic.twitter.com/Mc1dDtEXqB
— Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022
Comments
Please login to add a commentAdd a comment