వారెవ్వా బట్లర్‌.. డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌ | Jos Buttler Grabs A Stunning Flying Catch To Send Back Rohit Sharma | Sakshi
Sakshi News home page

ENG vs IND: వారెవ్వా బట్లర్‌.. డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published Sun, Jul 10 2022 8:19 AM | Last Updated on Sun, Jul 10 2022 9:52 AM

Jos Buttler Grabs A Stunning Flying Catch To Send Back Rohit Sharma - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో.. రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ బట్లర్‌ డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టీ20 మ్యాచ్‌:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 170/8 (20)
ఇంగ్లండ్‌ స్కోరు: 121 (17)
విజేత: ఇండియా(49 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: భువనేశ్వర్‌ కుమార్‌(3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)
చదవండి
IND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement