
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.
దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.
సూపర్ మ్యాన్‌లా..
221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.
ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు.
అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.
అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Athleticism at its best! 😎
An outstanding running catch from Hardik Pandya 🔥🔥
Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024