టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా పాకిస్తాన్-యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
30 పరుగులకే పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్(9), ఫఖార్ జమాన్(11), ఉస్మాన్ ఖాన్(3) వంటి స్టార్ బ్యాటర్లు ఎటువంటి ప్రభావం చూపకలేకపోయారు. నేత్రవల్కర్,నోస్తుష్ కేంజిగే, అలీ ఖాన్ తలా వికెట్ సాధించారు.
సూపర్ క్యాచ్..
ఇక ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను టేలర్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నేత్రవల్కర్ మూడో బంతిని రిజ్వాన్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
దీంతో రిజ్వాన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త లేట్‌గా స్వింగ్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ల్ స్లిప్‌లో ఉన్న టేలర్ తన కుడివైపునకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో రిజ్వాన్ మైండ్‌బ్లాంక్ అయిపోయింది. చేసేదేమి లేక రిజ్వాన్(9) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment