PC: X.com
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్‌తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్‌లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు.
షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్‌కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు.
Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet"
— Richard Kettleborough (@RichKettle07) April 19, 2024
Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo
Comments
Please login to add a commentAdd a comment