వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా పేసర్ల దాటికి ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్(81) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు.
ఫలించిన ద్రవిడ్ కృషి
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. స్లీప్‌లో సంచలన క్యాచ్‌లతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లను శుబ్‌మన్ అందుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో గిల్‌కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. స్లిప్‌లో క్యాచ్‌లను ఎలా అందుకోవాలన్న మెళకువలను ద్రవిడ్ నేర్పించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ స్లిప్‌లో మెరవడంతో ద్రవిడ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లైంది.
చదవండి: IND vs AUS: వారెవ్వా షమీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయిందిగా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment