IND Vs SL, 2nd T20I: Binura Fernando grabs a stunner to end Sanju Samson Video Viral - Sakshi
Sakshi News home page

IND vs SL: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే.. వీడియో వైరల్‌

Published Sun, Feb 27 2022 12:26 PM | Last Updated on Sun, Feb 27 2022 1:19 PM

Binura Fernando grabs a stunner to end Sanju Samson - Sakshi

Binura Fernando Grabs An Exceptional Catch: ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పీల్డర్‌ బినురా ఫెర్నాండో అద్భుతమైన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన లాహిరు కుమార బౌలింగ్‌లో..  సంజు శాంసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుని షార్ట్‌ థర్డ్‌మెన్‌ దిశగా వెళ్లగా.. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఫెర్నాండో జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో 39 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న శాంసన్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఇక ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

ఇక శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(75), షనకా(47) రాణించారు. ఇక 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కిషన్‌, రోహిత్‌ శర్మ వికెట్లను కోల్పోయింది. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌, శాంసన్‌ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. 39 పరుగులు చేసిన శాంసన్‌.. కూమార బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన జడేజా కూడా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతుల్లో జడేజా 7 ఫోర్లు, 1సిక్స్‌తో 45 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి తన బ్యాట్‌ను ఝులిపించాడు. 44 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా 17.1 ఓవర్లలోనే భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది.

చదవండి: IND vs SL: ఏ ముహుర్తానా సిరీస్‌ ప్రారంభమయిందో.. ఇషాన్‌ కిషన్‌ తలకు గాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement