
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శార్ధూల్ ఠాకూర్ అద్భతమైన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి రహానే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ ఠాకూర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా అంతకు ముందు మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర(61), పృథ్వీ షా(51) అర్ధ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.
ఇక 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 171 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54), నితీష్ రాణా(30) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్ యాదవ్ నాలుగు వికెట్లు, ఖాలీల్ ఆహ్మద్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు, లలిత్ యాదవ్ ఒక వికెట్ సాధించారు.
చదవండి: IPL 2022: ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు!
శార్ధూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయంది
Comments
Please login to add a commentAdd a comment