ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఆదివారం తన పాత జట్టు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసిన కుల్దీప్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఉమేశ్ యాదవ్‌తో కలిసి కుల్దీప్ 10 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే కుల్దీప్ వికెట్లు తీయడమే కాదు.. మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు.
ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని ఉమేశ్ యాదవ్ స్వీప్ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. దాదాపు 30 గజాల దూరం పరిగెత్తిన కుల్దీప్ ముందుకు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కాగా అదే ఓవర్‌లో కమిన్స్, నరైన్‌లను ఔట్ చేసిన కుల్దీప్.. ఒకే ఓవర్లు మూడు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన కుల్దీప్ తాజాగా ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నాడు. రానున్న టి20 వరల్డ్‌కప్ దృష్టిలో పెట్టుకొని కుల్దీప్ మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్నాడు.
కాగా కుల్దీప్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రాకముందు మూడేళ్ల పాటు కేకేఆర్‌కు ఆడాడు. ఈ మూడేళ్లలో కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కుల్దీప్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా గాయం కారణంగా కుల్దీప్ యాదవ్ గత సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే కుల్దీప్ ప్రదర్శనపై అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ''వికెట్లే కాదు.. స్టన్నింగ్ క్యాచ్‌లతోనూ అదరగొడుతున్నాడు.. పాత కుల్దీప్ కనిపిస్తున్నాడు.'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం!
కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి
ICYMI: @imkuldeep18 stole the show with the ball & scalped a match-winning 4⃣-wicket haul against #KKR. 👏 👏 #TATAIPL | #KKRvDC | @DelhiCapitals
— IndianPremierLeague (@IPL) April 10, 2022
Watch🎥 🔽https://t.co/3RvxXe4uk9
𝗣.𝗦.: 𝗗𝗼 𝗻𝗼𝘁 𝗺𝗶𝘀𝘀 𝘁𝗵𝗮𝘁 𝗯𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝘁 𝗰𝗮𝘂𝗴𝗵 & 𝗯𝗼𝘄𝗹𝗲𝗱!
Comments
Please login to add a commentAdd a comment