
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో కోహ్లి క్యాచ్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఆసీస్ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
కోహ్లి క్యాచ్ స్మిత్‌కు 157వది. తొలి స్థానంలో రికీ పాంటింగ్ 196 క్యాచ్‌లతో ఉన్నాడు. 181 క్యాచ్‌లతో మార్క్ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్ టేలర్‌తో కలసి స్టీవ్ స్మిత్ 157 క్యాచ్‌లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్ బోర్డర్ 156 క్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడుతుందా లేక మ్యాచ్ డ్రా చేసుకుంటుందా అన్నది చూడాలి. కోహ్లి ఉన్నంతవరకు గెలుపుపై ఆశలు ఉన్నా అతను ఔట్ కావడం టీమిండియాకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక రిస్క్ తీసుకోకుండా డ్రా కోసం ఆడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కోహ్లి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ అద్బుతంగా డైవ్ చేస్తూ అందుకున్నాడు.
He's an absolute G.O.A.T in slip fielding.#INDvsAUS #WTCFinals #WTC23Final #WTC2023Final #WTCFinals #TeamIndia #KingKohli #ViratKohli #AUSvsIND #ViratKohli𓃵 #SteveSmith pic.twitter.com/IHSn0rnlV0
— myKhel.com (@mykhelcom) June 11, 2023
Comments
Please login to add a commentAdd a comment