క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. పట్టిందో ఎవరో తెలుసా? | Ramandeep Singh Takes Superman Catch In IND A Vs PAK A Emerging Asia Cup Match, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. పట్టిందో ఎవరో తెలుసా?

Published Sun, Oct 20 2024 8:01 AM | Last Updated on Sun, Oct 20 2024 10:27 AM

Ramandeep Singh takes superman catch in IND A vs PAK A Emerging Asia Cup match

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌-2024లో భార‌త్ ఎ జ‌ట్టు శుభారంభం చేసింది. శ‌నివారం(అక్టోబ‌ర్ 19) దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. 184 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌నలో పాక్‌-ఎ జ‌ట్టు 7 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన భార‌త్  నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ‌(44) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అభిషేక్ శ‌ర్మ‌(35), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(36) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

ర‌మ‌ణ్‌దీప్‌ సింగ్ సూప‌ర్ క్యాచ్‌..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయ‌ర్ ర‌మ‌ణ్‌దీప్ సింగ్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో పాక్ స్టార్ బ్యాట‌ర్ యాసిర్ ఖాన్‌ను సింగ్ పెవిలియ‌న్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.

ఈ క్ర‌మంలో యాసిర్ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. షాట్ కూడా స‌రిగ్గా క‌న‌క్ట్ కావ‌డంతో అంతా సిక్స్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న ర‌మ‌ణ్‌దీప్ సింగ్ మాత్రం అంద‌రి అంచనాల‌ను త‌ల‌కిందులు చేశాడు. 

డిప్ మిడ్ వికెట్‌లో ర‌మ‌ణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అత‌డి విన్యాసం చూసి అంద‌రూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో నెటిజ‌న్లు క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్భుత క్యాచ్‌గా అభివ‌ర్ణిస్తున్నారు.
చదవండి: పాక్‌పై విజయం.. భారత్‌ ‘ఎ’ శుభారంభం



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement