Raman Deep Singh
-
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా?
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భారత్ ఎ జట్టు శుభారంభం చేసింది. శనివారం(అక్టోబర్ 19) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య చేధనలో పాక్-ఎ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ తిలక్ వర్మ(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(35), ప్రభుసిమ్రాన్ సింగ్(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.రమణ్‌దీప్ సింగ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాక్ స్టార్ బ్యాటర్ యాసిర్ ఖాన్‌ను సింగ్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమంలో యాసిర్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న రమణ్‌దీప్ సింగ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. డిప్ మిడ్ వికెట్లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి విన్యాసం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.చదవండి: పాక్‌పై విజయం.. భారత్ ‘ఎ’ శుభారంభం ONE OF THE GREATEST EVER CATCHES FROM RAMANDEEP SINGH. 🥶 pic.twitter.com/5gM0L02eDv— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024 -
భారత్ గర్జన
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్‌పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్‌ను దక్కించుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్‌తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
సమరం సమం
యాంట్‌వర్ప్ (బెల్జియం) : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను ఈ రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా ముగించాయి. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (13వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ ఇమ్రాన్ మహ్మద్ (23వ, 37వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ను అందించాడు. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ప్రస్తుతం భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌లు లేకుండానే బరిలోకి దిగింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషం నుంచే భారత ఆటగాళ్లు సమన్వయంతో కదులుతూ పాక్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. ఆట 13వ నిమిషంలో గుర్మెయిల్ సింగ్ కుడి వైపు నుంచి కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో రమణ్‌దీప్ సింగ్ డైవ్ చేస్తూ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో భారత్ ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్లో పాక్ జట్టు తేరుకుంది. పదేపదే దాడులు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచింది. 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను ఇమ్రాన్ గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత మూడో క్వార్టర్లోని 37వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇమ్రాన్ సద్వినియోగం చేసుకోవడంతో పాక్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పాక్‌కు ఈ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. రెండు నిమిషాల తర్వాత రమణ్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 2-2తో సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లు మరో గోల్ కోసం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడుతుంది.