Photo: IPL Twitter
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో సొంతగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుత విన్యాసాన్ని ప్రదర్శించాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతా బౌండరీ వెళుతుందని అనుకున్నారు.
కానీ అక్కడే ఉన్న మార్క్రమ్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌ను ఊహించని సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కాగా అంతకముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌ల క్యాచ్‌లు తీసుకుంది కూడా మార్ర్కమ్ కావడం విశేషం.
ఈ నేపథ్యంలో మార్క్రమ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు క్యాచ్‌లను ఒకే ప్లేయర్ తీసుకోవడం ఇది నాలుగో సారి మాత్రమే. ఇంతకముందు కేన్ రిచర్డ్‌సన్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ 2014లో, హార్దిక్ పాండ్యా వర్సెస్ సీఎస్‌కే 2015లో, ఫాఫ్ డుప్లెసిస్ వర్సెస్ కేకేఆర్ 2019లో ఉన్నారు.
Aiden Markram setting an example on the field!
— OneCricket (@OneCricketApp) April 18, 2023
All three catches so far taken by the South African...
That SKY catch was a scorcher!#IPL2023 #SRHvsMI #RohitSharma #AidenMarkram #TATAIPL #MumbaiIndians #SunrisersHyderabadpic.twitter.com/fUV54r2Gaq
CAUGHT IN 4K - Aiden Markram 🔥#TATAIPL #IPLonJioCinema #SRHvMI #IPL2023 #OrangeFireIdhi | @SunRisers @AidzMarkram pic.twitter.com/WJVkXuH2pL
— JioCinema (@JioCinema) April 18, 2023
Comments
Please login to add a commentAdd a comment