మరో గోల్డెన్‌ డక్‌.. టి20ల్లో కూడా పనికిరాడా? | Cricket Fans Troll Suryakumar Yadav 4th Golden Duck Last 6 Innings | Sakshi
Sakshi News home page

Suryakumar: మరో గోల్డెన్‌ డక్‌.. టి20ల్లో కూడా పనికిరాడా?

Published Tue, Apr 11 2023 11:36 PM | Last Updated on Tue, Apr 11 2023 11:39 PM

Cricket Fans Troll Suryakumar Yadav 4th Golden Duck Last 6 Innings - Sakshi

Photo: IPL Twitter

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్‌ డక్‌ కావడం గమనార్హం.

ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్య మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 15 పరుగులు, రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటైన సూర్య.. తాజాగా మాత్రం గోల్డెన్‌ డక్‌ అయ్యి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. సూర్య ఆటతీరు తమను బాధిస్తుందని అభిమానులు పేర్కొన్నారు.  

''టెస్టుల్లో అవకాశమిస్తే విఫలమ్యాడు.. వన్డేల్లో గోల్డెన్‌డక్‌ అయ్యాడు.. ఇప్పుడు టి20ల్లో విఫలమవుతూ ఈ ఫార్మాట్‌లో కూడా పనికిరాడా అన్నట్లుగా తయారవుతున్నాడంటూ'' కామెంట్స్‌ చేశారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

చదవండి: ఒక్క హాఫ్‌ సెంచరీతో రెండేళ్ల నిరీక్షణకు తెర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement