
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ సూపర్‌స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడినట్లు కనిపించిన సూర్య ఆ తర్వాత వరుస అర్థసెంచరీలతో హోరెత్తించాడు. ముంబై ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఐదు అర్థసెంచరీలు బాదిన సూర్యకుమార్.. తాజాగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ సాధించాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్న తన హిట్టింగ్ కొనసాగించిన సూర్యకుమార్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన సూర్య 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. కాగా సూర్యకుమార్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
A 💯 that wowed teammates, fans and opponents alike 🤩
— JioCinema (@JioCinema) May 12, 2023
Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz