Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోతున్నాడు. తొలి అంచె పోటీల్లో పెద్దగా మెరవని సూర్య వరుస డకౌట్లతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కాస్త గాడిన పడిన సూర్య రెండో అంచె పోటీల్లో మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
తాజాగా మంగళవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనను SKY(స్కై) అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం కష్టమని ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది.
200 పరుగుల భారీ టార్గెట్ కనిపిస్తున్నా సూర్య ఏమాత్రం బెదరలేదు. బంతిని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న సూర్యకుమార్ 26 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 35 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫిఫ్టీకి 36 బంతులు తీసుకున్న సూర్య.. ఆ తర్వాత 9 బంతుల్లో 33 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
సూర్య విధ్వంసం ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. ఆర్‌సీబీపై భారీ విజయంతో నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్న ముంబై మూడో స్థానానికి దూసుకొచ్చింది.
ICYMI - Here's SKY flexing his range of shots 😉
— JioCinema (@JioCinema) May 9, 2023
#MIvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/FwvUmVpLsp
Comments
Please login to add a commentAdd a comment