Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌సీబీ నాసిరకం బౌలింగ్‌ను చీల్చిచెండాడిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు 200 పరుగుల టార్గెట్‌ను 16.3 ఓవర్లలోనే చేధించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. 200 ప్లస్ టార్గెట్ చేధించే క్రమంలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి ముంబై ఇండియన్స్ తొలి స్థానంలో నిలిచింది.
► మంగళవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌ను ముంబై 22 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 2017లో గుజరాత్ లయన్స్‌పై 208 పరుగులు టార్గెట్‌ను 15 బంతులు మిగిలి ఉండగానే చేధించి విజయం అందుకుంది. ఇక మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. 2010లో అప్పటి కింగ్ష్ ఎలెవెన్ పంజాబ్ 201 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
► ఇక ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేధించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2023 సీజన్‌లోనే ముంబై మూడుసార్లు 200 ప్లస్ స్కోర్లను చేధించింది. ఈ జాబితాలో ముంబై తర్వాత పంజాబ్ కింగ్స్ రెండు సార్లు(2014లో), సీఎస్‌కే రెండుసార్లు(2018లో) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment