
Ravindra Jadeja Stunning Fielding Effort.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గొప్ప ఫీల్డర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో జడేజా మరోసారి రుచి చూపించాడు. దాదాపు జడేజా క్యాచ్ పట్టేసినప్పటికి చివరి నిమిషంలో బంతిని నేలకు తాకించడంతో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ ఇచ్చాడు. కానీ జడేజా మాత్రం అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగా అయిపోళ్లంము కదా.. ఇప్పుడు..
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో షమీ వేసిన బంతిని కరీమ్ జైనత్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే జడేజా వేగంగా పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. టీమిండియా అప్పీల్ చేసింది. సాఫ్ట్‌సిగ్నల్‌లో ఔట్ అని ప్రకటించినా.. చివరి నిమిషంలో జడేజా బంతిని కింద ఆనించినట్లు రిప్లైలో అన్‌క్లియర్‌గా ఉంది. దీంతో థర్డ్ అంపైర్ మాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ అని ఇచ్చాడు. దీంతో కోహ్లి ఇదేంటి అన్నట్లుగా అంపైర్‌వైపు ఆశ్చరంగా చూశాడు. అయితే జడేజా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే మాత్రం మ్యాచ్ ''క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్''గా నిలిచిపోయేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కోహ్లి రియాక్షన్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.
చదవండి: IND Vs AFG: టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు
— Cric Zoom (@cric_zoom) November 3, 2021