LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్ | IPL 2024 LSG Vs GT: Ravi Bishnoi Takes One Handed Stunner To Dismiss Kane Williamson, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్

Published Sun, Apr 7 2024 11:09 PM | Last Updated on Mon, Apr 8 2024 10:14 AM

Ravi Bishnoi takes one handed stunner to dismiss Kane Williamson - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో గుజరాత్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ను బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌.. రెండో బంతిని ఆఫ్‌ స్టంప్‌ వెలుపుల సంధించాడు.

ఆ బంతిని విలియమ్సన్‌ స్టైట్‌గా సింగిల్‌ కోసం చిప్‌ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్‌ తన కుడివైపున్‌కి జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్‌ మామతో పాటు గ్రౌండ్‌లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్‌ అయిపోయారు. 

దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్‌.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement