
Courtesy : IPL T20. Com
అహ్మదాబాద్: కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. రవి తాను ఉన్న స్థానం నుంచి కొన్ని గజాల దూరం ముందుకు పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అర్షదీప్ వేసిన బంతిని నరైన్ డీప్‌మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే అక్కడే ఉన్న రవి బిష్ణోయ్ క్యాచ్ అందుకోవడం కాస్త కష్టతరంగా ఉన్నా.. కొన్ని గజాలు ముందుకు పరిగెత్తి డైవ్ చేసి క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. దీంతో నరైన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
చదవండి: హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు
Incredible catch from Ravi Bishnoi! pic.twitter.com/jSlXcodO75
— Anurag ☮️😷 (@anuragb0rah) April 26, 2021